టైటిల్ మార్పు.. కారణం అదేనా?

Posted By: Prashanth

టైటిల్ మార్పు.. కారణం అదేనా?

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కింగ్ సామ్‌సంగ్ నుంచి ప్రతిష్టాత్మకంగా విడుదలైన గెలాక్సీ ఎస్3 ఈ ఏడాదికి గాను ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి గుర్తింపుతెచ్చుకున్న విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్3 సక్సెసర్ వర్షన్ గెలాక్సీ ఎస్4 కు సంబంధించి ఇప్పటికే రూమర్ మిల్స్ అనేక వార్తలను మోసుకొస్తున్నాయి. తాజాగా నీనామార్క్ 2 బెంచ్ మార్క్ డేటా బేస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా రాబోతున్నగెలాక్సీ స్మార్ట్ ఫోన్ మోడల్ నెంబరు ‘జీటీ -19525’గా తెలుస్తోంది. ఈ డివైజ్‌ను ‘గెలాక్సీ ఎస్’గా పిలవనున్నారట. ఇందుకు కారణం నాలుగు అంకె సౌత్ కొరియాలో అచ్చిరాదట. ప్రపంచానికి గెలాక్సీ ఎస్4గా పరిచయమైన గెలాక్సీ ఎస్3 సక్సెసర్ ఫోన్‌ను ఇకపై ‘గెలాక్సీ ఎస్’గా పిలవాలేమో!. బెంచ్ మార్క్ డేటా బేస్ విడుదల చేసిన సమాచారం మేరకు రూపుదిద్దుకుంటున్న కొత్త హ్యాండ్‌సెట్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ 5.0 ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, ఆర్మ్ మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఆధునిక వర్షన్ ఫీచర్లను నిక్షిప్తం చేయునున్నట్లు తెలుస్తోంది.

గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్‌లు (రూమర్స్ ఆధారంగా):

13 మెగా పిక్సల్ కెమెరా,

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బుల్ట్ ఇన్ స్కైప్,

2జీబి ర్యామ్,

ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 16జిబి/32జీబి/64జీబి/128జీబి,

4జీ ఎల్ టీఈ డేటా స్పీడ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot