ఫిబ్రవరి 2013.. చరిత్రలో నిలిచిపోనుందా?

Posted By: Prashanth

ఫిబ్రవరి 2013.. చరిత్రలో నిలిచిపోనుందా?

 

దిగ్గజ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ మరో బృహత్తరమైన ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. తన ఖ్యాతిని మరింత రెట్టింపు చేసిన గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా గెలాక్సీ ఎస్4ను 2013 ప్రధామకంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కొత్త తరం స్మార్ట్‌ఫోన్‌ను ఈ వింటర్‌లో జరిగే ‘యూరోపియార్ టెక్నాలజీ ఎక్ప్ పో’లో ప్రదర్శించే అవకాశముందని పలు నివేదికులు అంటున్నాయి. ఈ డివైజ్‌లో వినియోగించిన కార్టెక్స్-ఏ15డిజైన్‌తో కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ‘అడోనిస్’ (Adonis) కోడ్ నేమ్‌తో పిలుస్తున్నట్లు డిజిటల్ డైలీ పేర్కొంది. గెలాక్సీ ఎస్4ను వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ఆవిష్కరించేందుకు సామ్‌సంగ్ సిద్ధంగా ఉన్నట్లు పేరు చెప్పటానికి నిరాకరించిన సామ్‌సంగ్ ప్రతినిధి ఒకరు తమతో తెలపినట్లు కొరియన్ న్యూస్ వర్గాలు వెల్లడించాయి.

పలు నివేదికలు ఆధారంగా సేకరించిన గెలాక్సీ ఎస్4 ఫీచర్లు (ఊహాజనితంగా):

5 అంగుళాల వోఎల్ఈడి డిస్‌ప్లే,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

అమ్మకాల విషయంలో రికార్డులను నమోదు చేస్తున్న గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot