అగ్ని ప్రమాదం... గెలాక్సీ ఎస్5 విడుదల వాయిదా?

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా సామ్‌సంగ్ ఆవిష్కరించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ డివైస్ ఏప్రిల్ 11 నుంచి అంతర్జాతీయంగా విడుదల కావల్సి ఉంది. అనుకోకుండా చోటుచేసుకున్న ఓ దుర్ఘటన కారణంగా గెలాక్సీ ఎస్5 విడుదల జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

 అగ్ని ప్రమాదం... గెలాక్సీ ఎస్5 విడుదల వాయిదా?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్)లను తయారు చేస్తున్న ఓ దక్షిణ కొరియా కంపెనీలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు $1 బిలియన్ విలువ చేసే సామాగ్రికి నష్టం వాటల్లిన్నట్లు ఓ అంచనా.

279మంది అగ్నిమాపక సిబ్బంది 81 పైర్ ఇంజన్ల సహాయంతో 6 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ ఘటన ప్రభావం  గెలాక్సీ ఎస్5 విడుదల తేదీ పై ఉండబోదని సామ్‌సంగ్ పేర్కొన్నట్లు సమాచారం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting