20 మంది ప్రాణాలను కాపాడిన శాంసంగ్ గెలాక్సీ S8

By Gizbot Bureau
|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో అరుదన ఘనతను చాటుకుంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ ఏకంగా 20 మంది ప్రాణాలను కాపాడిన సంఘటన శాంసంగ్ కంపెనీని, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సముద్రంలో మునిగిన 20 మంది ప్రాణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్8 రక్షించిందని కంపెనీ వెల్లడించింది.

This two-year-old Samsung phone saved lives in a motorboat accident

పూర్తి వివరాల్లోకెళితే.. ఫిలిప్పైన్స్‌లో సెబూ నగరంలోని దాన్ బంటయాన్ మలపస్కా ద్వీపంలో మోటార్ బోట్ మునిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సముద్రంలో మునిగిపోయినట్టు స్థానిక మీడియా నివేదించింది. పడవలో ప్రయాణిస్తున్న 16మంది విదేశీ ఈతగాళ్లతో పాటు నలుగురు ఫిలిప్ఫినో జాతీయులు ఉన్నారు. నీటిలో మునిగిన ప్రయాణికుల్లో కెనడాకు చెందిన ప్రయాణికుడి దగ్గర శాంసంగ్ గెలాక్సీ S8 స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు ఓ బ్లాగ్ పోస్టు తెలిపింది.

SOS ఫీచర్

SOS ఫీచర్

పడవ సముద్రంలో మునిగిన 30 నిమిషాల ద్వారా శాంసంగ్ ఫోన్ ద్వారా కోస్టు గార్డులకు ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. GPS లొకేషన్ ఆధారంగా ట్రాప్ చేసిన కోస్ట్ గార్డులు ప్రయాణికులను రక్షించారు. శాంసంగ్ గెలాక్సీ S8లో IP68 రేటింగ్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్‌ను 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతున్న నీటిలో ఉంచితే చాలు.. అందులోని SOS ఫీచర్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. తద్వారా మెసేజ్ ఎమర్జెన్సీ సెంటర్‌కు వెళ్తుంది.

అప్రమత్తమైన కోస్టల్ గార్డ్సు

అప్రమత్తమైన కోస్టల్ గార్డ్సు

పడవ ప్రమాద సమయంలో కూడా శాంసంగ్ గెలాక్సీ S8 ఫీచర్ యాక్టివేట్ అయి సమీపంలోని ఎమర్జెన్సీ సెంటర్‌కు మెసేజ్ వెళ్లింది. అప్రమత్తమైన కోస్టల్ గార్డ్సు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. ఈ ఘటన అనంతరం కెనడా జాతీయుడు తన స్మార్ట్ ఫోన్ తీసుకుని శాంసంగ్ కంపెనీ దగ్గరకు వెళ్లాడు.అక్కడి ఇంజినీరింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.ఎమర్జెన్సీ SOS యాక్టివేట్ అయినప్పటి నుంచి అలానే ఉండిపోయిందని తెలిపాడు.

గెలాక్సీ S8 రెండేళ్ల క్రితమే రిలీజ్
 

గెలాక్సీ S8 రెండేళ్ల క్రితమే రిలీజ్

శాంసంగ్ నుంచి గెలాక్సీ S8 రెండేళ్ల క్రితమే రిలీజ్ అయింది. శాంసంగ్ ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇంగ్రెస్ ప్రొటక్షన్ లేదా IP రేటింగ్ వివిధ స్థాయిలో ఉంటుంది. శాంసంగ్ కొత్తగా రిలీజ్ చేసిన గెలాక్సీ S9, గెలాక్సీ S10 సిరీస్ ఫోన్లలో కూడా IP68 రేటింగ్ టెక్నాలజీ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కంజ్యూమర్ కమిషన్ (ACCC) శాంసంగ్ కంపెనీపై ఆరోపణలు గుప్పించింది. సాల్ట్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్‌లో తమ డివైజ్ లు ఎలా ప్రభావితం చూపిస్తాయో పూర్తి స్థాయిలో టెస్టింగ్ నిర్వహించలేదని విమర్శించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫీచర్లు

6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్,12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,హార్ట్‌రేట్ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్,ఐరిస్ స్కానర్, బారో మీటర్,ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ,3500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లైస్ ఫాస్ట్ చార్జింగ్

Best Mobiles in India

English summary
This two-year-old Samsung phone saved lives in a motorboat accident

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X