శాంసంగ్ మరో సంచలనం, గెలాక్సీ S9 దూసుకొస్తోంది !

Posted By: Madhavi Lagishetty

స్మార్ట్ ఫోన్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ రోజురోజుకూ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందిస్తూ ది బెస్ట్ అనిపించుకుంటుంది శాంసాంగ్.

శాంసంగ్ మరో సంచలనం, గెలాక్సీ S9 దూసుకొస్తోంది !

ఈ సంస్థ కొన్ని రోజుల క్రితమే గెలాక్సీ నోట్ 8ను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రపంచ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ డివైస్ యొక్క అమ్మకానికి టైం దగ్గర పడింది. అయితే గెలాక్సీ S9కు సంబంధించిన రూమర్స్ మరియు స్పెక్యూలేషన్స్ ఎప్పటినుంచో వస్తున్నాయి.

గెలాక్సీ S9 2018 ఫస్ట్ క్వార్టర్లో రిలీజ్ చేస్తున్నందున..ఇది గెలాక్సీ S9 గురించి ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. గెలాక్సీ S9 జనవరిలో లాంచ్ అవుతుందని కొరియా హెరాల్డ్ వెబ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇది షెడ్యూల్ కంటే ముందుకుగా లాంచ్ కానుంది.

స్పెక్యూలేషన్స్ ప్రకారం మనం వెళ్లాలని అనుకుంటే...నవంబర్ లో స్మార్ట్ ఫోన్ కోసం OLEDడిస్ ప్లే ప్యానెల్లను శాంసాంగ్ షిప్పింగ్ చేయనుంది. డివైస్ కోసం ఉద్దేశించిన ఇతర యాక్సరీస్ కంటే ముందు ప్యానెల్లు షిప్పింగ్ చేస్తుండటంతో...ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండు నెలల ముందే ఇది రానుంది.

జియోకు ముందు, జియోకి తరువాత.. దేశం పరిస్థితి ఎలా తయారైందంటే..

ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం...గెలాక్సీ S9 ప్రాజెక్ట్ స్టార్ గా కోడ్ నేమ్ గా భావిస్తున్నారు. రాబోయే ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ QHD+ సూపర్ ఆల్మోడ్ ఇన్ఫినిటీ డిస్ ప్లేను అదే స్క్రీన్ సైజుతో మరియు 18:5:9 అస్పాక్ట్ రేషియోని గెలాక్సీ S8లో చూసినట్లుగా ఉంటుందని వెల్లడించింది.

ఈ మధ్యకాలంలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం శాంసాంగ్ గెలాక్సీ S9 4జిబి ర్యామ్ తో వస్తుందని పేర్కొన్నాయి. గెలాక్సీ S8, గెలాక్సీ S8+గెలాక్సీ S7 మరియు S7 ఎడ్జ్ చూసినట్లుగానే ఉంటుంది. గెలాక్సీ నోట్ 8 వంటి స్మార్ట్ ఫోన్ కూడా ఒక డ్యుయల్ కెమెరా సెటప్తో వస్తోంది. వీటితోపాటు క్వాల్కమ్, స్నాప్ డ్రాగెన్ 845 SoC , మాడ్యులర్ డిజైన్లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది.

English summary
Samsung Galaxy S9, the upcoming flagship smartphone is believed to be unveiled early in January 2018.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot