MWC 2018లో శాంసంగ్ గెలాక్సీ S9, S9+ రిలీజ్ !

By Madhavi Lagishetty
|

శాంసంగ్ అభిమానులకు, టెక్నాలజీ ఔత్సాహికులకు శాంసంగ్ గూడ్ న్యూస్ చెబుతోంది. శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్ షిప్స్ గురించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వస్తునే ఉన్నాయి. వాటన్నింటికి చెక్ పెట్టేలా కంపెనీ ప్రకటన చేసింది. ఫిబ్రవరి నెలలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC ) 2018లో గెలక్సీ S9, S9+లను రిలీజ్ చేస్తామని కొరియా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

 
Samsung Galaxy S9 and S9+ to launch at MWC 2018: Officially confirmed

శాంసంగ్ మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ డి.జె.కో. కోఎస్...విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...2018 ఫస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను MWCలో ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ZDNET నివేదించిన సందర్భంలో విక్రయాల తేదీ ప్రకటించబడుతుంది.

ఈ ప్రకటనతో కొత్త ఫ్లాగ్ షిప్ సంస్థ యొక్క 2017ఫ్లాగ్ షిప్స్ గెలాక్సీ S8 , S8+కు వారసులుగా ఉండనున్నాయి. శాంసంగ్ ఈవెంట్లో గెలాక్సీ S9,S9+ మరో రెండు వేర్వేరు వేరియంట్లను కూడా ప్రకటించనుంది.

మునుపటి స్పెక్యూలేషన్స్....

మునుపటి స్పెక్యూలేషన్స్....

గతంలో కొత్త గెలాక్సీ సిరీస్ ఫ్లాగ్ షిప్ను ఆవిష్కరించింది. తర్వాత కంపెనీ ఫిబ్రవరి 26న గెలాక్సీ S9కోసం ఒక ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు ప్రకటించింది. MWC ప్రారంభ తేదీ, అవుట్లెట్ ఉందని తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో కంపెనీ నుండి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. MWCలో ఫోన్ల ప్రయోగం కోసం అంతా రెడీ చేసినట్లు ధ్రువీకరించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఒక సన్నని బెజిల్, ఇన్ఫినిటీ డిస్ప్లే తోపాటు డ్యుయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో వస్తున్నాయని రూమర్స్ వస్తున్నాయి.

ఎక్స్ పెక్టెడ్ ఫీచర్స్.....
 

ఎక్స్ పెక్టెడ్ ఫీచర్స్.....

గెలాక్సీ S9, S9+లలో ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్...స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ కెమెరా కింద ఉండే అవకాశం ఉందని గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. ఆక్టా కోర్ క్వాల్కమ్, స్నాప్ డ్రాగెన్ 845 SOCలేదా శాంసంగ్ ఎక్వైనోస్ 9810 SOC, 8.0 ఓరెయో, అవుట్ ఆఫ్ ది బాక్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S9+ 6జిబి ర్యామ్, 512జిబి స్టోరేజి, డ్యుయల్ కెమెరా సెటపు కలిగి ఉండే అవకాశం ఉంది. రెండు గెలాక్సీ S మోడల్స్ ఎక్కువగా 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ మరియు ఇతర ఉత్తేజకరమై ఫీచర్లతో రానున్నాయి.

వాట్సప్‌లో ప్రమాదకర లోపం, డేంజర్ జోన్‌లో గ్రూపు చాటింగ్‌లు !వాట్సప్‌లో ప్రమాదకర లోపం, డేంజర్ జోన్‌లో గ్రూపు చాటింగ్‌లు !

ఇతర ప్రకటనలు....

ఇతర ప్రకటనలు....

ప్రెస్ కార్యక్రమంలో కో...ఒక ఫోల్బుల్ ఫోన్ గురించి తెలిపాడు. దక్షిణ కొరియా దిగ్గజం వచ్చేఏడాది కొత్త డివైసు ప్రారంభించే అవకాశం ఉందని సూచించారు. ఈ ఏడాది తర్వాత BIXBY 2.0లభ్యతను ప్రకటించాడు. 2020నాటికి BIXBY వర్చువల్ అసిస్టెంట్ అన్నీ కూడా శాంసంగ్ పరికరాల్లో అందుబాటులో ఉంటాయని కూడా హామీ ఇచ్చారు.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung's Mobile Communications Business President DJ Koh addressing a press conference at CES 2018 revealed that the first flagship smartphone of 2018 will be unveiled at MWC.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X