Samsung Galaxy Tab A8 మొదటి సేల్ లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ గత వారం భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 టాబ్లెట్ ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఈ టాబ్లెట్ ఈరోజు నుండి కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కొత్త గెలాక్సీ టాబ్లెట్‌లు 10.5-అంగుళాల WUXGA డిస్‌ప్లేను కలిగి ఉండి Wi-Fi మరియు Wi-Fi + LTE వేరియంట్‌లలో అందించబడతాయి. Samsung Galaxy Tab A8 ఆక్టా-కోర్ ప్రాసెసర్ Soc మరియు 4GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో కూడిన 7,040mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. క్వాడ్ స్పీకర్ సెటప్ తో డాల్బీ అట్మోస్ ఆడియోకి మద్దతునిచ్చే ఈ టాబ్లెట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతదేశంలో Samsung Galaxy Tab A8 ధర, విక్రయ ఆఫర్‌లు

భారతదేశంలో Samsung Galaxy Tab A8 ధర, విక్రయ ఆఫర్‌లు

భారతదేశంలో గురువారం లాంచ్ అయిన Samsung Galaxy Tab A8 యొక్క 3GB RAM + 32GB స్టోరేజ్ Wi-Fi ఓన్లీ బేస్ వేరియంట్ ధర రూ.17,999 కాగా దాని Wi-Fi + LTE వేరియంట్ ధర రూ.21,999. అలాగే 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ Wi-Fi ఓన్లీ వేరియంట్ యొక్క ధర రూ. 19,999 కాగా Wi-Fi + LTE వేరియంట్‌ ధర రూ.23,999. ఈ కొత్త Samsung టాబ్లెట్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, Reliance Digital మరియు ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. Samsung ఈ టాబ్లెట్‌ను నో-కాస్ట్ EMIలతో రూ.1,777.66 నుండి అందిస్తోంది. దీనితో పాటు ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. కస్టమర్‌లు రూ.4,499 విలువైన బుక్ కవర్‌ని కూడా గాలాక్సీ ట్యాబ్ A8 కొనుగోలుతో కేవలం రూ.999 ధరతో పొందవచ్చు.

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్స్

కొత్తగా ప్రారంభించబడిన Samsung Galaxy Tab A8 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 10.5-అంగుళాల LCDని కలిగి ఉంటుంది. ఇది 1,920 x 1,200 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 16:10 కారక నిష్పత్తిని అందిస్తుంది. కంపెనీ ప్రకారం కొత్త టాబ్లెట్ దాని ముందున్న Galaxy Tab A7 లాగానే నాలుగు డాల్బీ అట్మోస్-ఎనేబుల్డ్ స్పీకర్లతో వస్తుంది. ఈ ట్యాబ్ 2GHz వద్ద క్లాక్ చేయబడిన Unisoc టైగర్ T618 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. గెలాక్సీ ట్యాబ్ A8 యొక్క CPU మరియు GPU ప్రతి ఒక్కటి ముందుతరంతో పోలిస్తే సున్నితమైన పనితీరును అందించడానికి 10% వరకు పెంచబడ్డాయి. అలాగే ఇది ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది.

Galaxy Tab A8

Samsung Galaxy Tab A8 యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ట్యాబ్ 4 GB RAM మరియు 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది Wi-Fi 5 (ac) మరియు బ్లూటూత్ 5కి మద్దతుతో వచ్చే WiFi మరియు LTE వేరియంట్‌లో వస్తుంది. టాబ్లెట్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB-C 2.0 పోర్ట్ కూడా ఉన్నాయి. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7,040 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే టాబ్లెట్ 7.5W ఛార్జర్‌తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab A8 First Sale Live in India With Unexpected Discount Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X