Samsung Galaxy S21 Fe 5G మరియు Galaxy Tab A8 యొక్క ధరలు మరియు ఆఫర్లు.

By Maheswara
|

Samsung Galaxy Tab A8 గత వారం భారతదేశంలో లాంచ్ చేయబడింది. మరియు ఈరోజు నుండి కొనుగోలు చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త Galaxy టాబ్లెట్‌లు 10.5-అంగుళాల WUXGA డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Wi-Fi మరియు Wi-Fi + LTE రెండు వేరియంట్‌లలో ఈ టాబ్లెట్ వస్తుంది. Samsung Galaxy Tab A8 పేరులేని ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4GB వరకు RAMతో జత చేయబడింది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో భారీ 7,040mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Galaxy టాబ్లెట్ యొక్క క్వాడ్ స్పీకర్ సెటప్ డాల్బీ అట్మోస్ ఆడియోకి మద్దతునిస్తుంది.

 

భారతదేశంలో Samsung Galaxy Tab A8 ధర, సేల్ ఆఫర్‌లు

భారతదేశంలో Samsung Galaxy Tab A8 ధర, సేల్ ఆఫర్‌లు

గురువారం లాంచ్ అయిన Samsung Galaxy Tab A8 ధర బేస్ 3GB RAM + 32GB స్టోరేజ్ Wi-Fi మాత్రమే వేరియంట్ కోసం రూ.17,999, దాని Wi-Fi + LTE వేరియంట్ ధర రూ. 21,999. స్టోరేజ్ వేరియంట్ - 4GB RAM + 64GB స్టోరేజ్ - Wi-Fi మాత్రమే ధర రూ. 19,999  మరియు Wi-Fi + LTE వేరియంట్‌ల ధర రూ. 23,999,గా ఉంది.

ఈ కొత్త Samsung టాబ్లెట్‌ను అధికారిక వెబ్‌సైట్, Amazon, Reliance Digital మరియు ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. Samsung ఈ టాబ్లెట్‌ను నో-కాస్ట్ EMIలతో రూ.1,777.66  నుండి అందిస్తోంది. దీనితో  పాటు ICICI బ్యాంక్ కార్డ్‌లకు రూ.2,000 క్యాష్‌బ్యాక్. ఇంకా ,ఆఫర్లో భాగంగా కస్టమర్‌లు రూ.4,499  విలువైన బుక్ కవర్‌ని కేవలం రూ. 999 కి పొందవచ్చు.

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్స్
 

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Tab A8 Android 11 తో వస్తుంది. మరియు 10.5-అంగుళాల WUXGA (1,920x1,200 పిక్సెల్‌లు) TFT డిస్‌ప్లే 16:10 యాస్పెక్ట్ రేషియో, 80 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు అన్ని వైపులా స్లిమ్ బెజెల్స్‌తో ఉంటుంది. ట్యాబ్లెట్‌ను పవర్ చేయడం అనేది పేరులేని 2GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4GB వరకు RAM మరియు 64GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జతచేయబడింది. ఆప్టిక్స్ పరంగా, Samsung Galaxy Tab A8 , 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఒకే వెనుక కెమెరా మరియు ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మాస్ ఆడియోకు సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ v5, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్, లైట్, హాల్ సెన్సార్, GPS, గ్లోనాస్, బీడౌ మరియు గెలీలియో ఉన్నాయి. Galaxy టాబ్లెట్ Samsung Knox డిఫెన్స్-గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్‌ను పొందుతుంది. Samsung Galaxy Tab A8 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,040mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీని కొలతలు 246.8x161.9x6.9mm మరియు బరువు 508 గ్రాములు.

గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ కూడా

గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ కూడా

శామ్సంగ్ యొక్క అభిమానులు ఎప్పటి నుంచో ఎదుచూస్తున్న గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ కూడా గత వారం భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త శామ్సంగ్ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించబడిన గెలాక్సీ S20 FE 5G యొక్క అప్ డేట్ వెర్షన్ గా వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 120Hz AMOLED డిస్‌ప్లే ఫీచర్లతో లభిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G యొక్క భారతీయ వేరియంట్ Exynos 2100 SoCతో రన్ అవుతూ నాలుగు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది.శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది జనవరి 11 నుండి Amazon, Samsung.com మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్‌లలో భాగంగా HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ తరువాత దీనిని రూ.49,999  ధర వద్ద పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్పెసిఫికేషన్స్ వివరాలు.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్పెసిఫికేషన్స్ వివరాలు.

Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్ One UI 4 మరియు ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab A8 Is Available For Purchase In India Now. Price,Specifications And Other Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X