Home
News

శాంసంగ్ కొత్త టాబ్లెట్ ల స్పెసిఫికేషన్లు లీక్! లాంచ్ ఎప్పుడో చూడండి

By Maheswara

శాంసంగ్ సంస్థ తమ కొత్త గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్‌ను ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్ సిరీస్ లో మూడు ఉద్దేశించిన మోడల్‌లు ఉంటాయని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9, గెలాక్సీ ట్యాబ్ S9+ మరియు గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రా మోడళ్ళుగా లాంచ్ కాబోతున్నాయి.

ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో జరిగే రెండవ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ టాబ్లెట్‌లను లాంచ్ చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. గెలాక్సీ ట్యాబ్ S8, గెలాక్సీ ట్యాబ్ S8+ మరియు గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా మోడల్‌లతో కూడిన ట్యాబ్ S8 సిరీస్ ను గత సంవత్సరం ఫిబ్రవరి 2022లో ప్రారంభించబడింది. ఇప్పుడు, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రా మోడల్‌కి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు పరిశీలిద్దాం.

Samsung Galaxy Tab S9 Ultra Expected To Feature With Snapdragon 8 Gen 2 SoC, Other Specifications leaked.

ప్రముఖ టిప్ స్టర్ రెవెగ్నుస్ (@Tech_Reve) ఒక ట్వీట్‌ ద్వారా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రా టాబ్లెట్‌ను స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC తో లాంచ్ చేస్తుందని సూచించారు. ఈ గెలాక్సీ పరికరం కోసం క్వాల్కమ్ చిప్‌సెట్ ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే చిప్ సెట్ శాంసంగ్ గెలాక్సీ S23, శాంసంగ్ గెలాక్సీ S23+ మరియు శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రాతో సహా గెలాక్సీ S23 సిరీస్‌ లో కూడా ఉపయోగిస్తారు.

టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రాలో 10,880mAh బ్యాటరీ కూడా ఉంటుంది, ఇది గత సంవత్సరం లాంచ్ చేసిన గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రాలో ఉపయోగించిన బ్యాటరీ 11,220mAh కంటే మూడు శాతం తక్కువ. అయినప్పటికీ, గెలాక్సీ కోసం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ముందు వెర్షన్ ట్యాబ్ లో ఉపయోగించిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్ కంటే ఎక్కువ శక్తి-సమర్థవంతమైనది. 2023 మోడల్ ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని అందించగలదని సూచిస్తుంది.

శాంసంగ్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రా టాబ్లెట్‌లో IP67 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉండవచ్చని మునుపటి నివేదిక సూచించింది. ఇది కంపెనీ యొక్క హై-ఎండ్ టాబ్లెట్‌ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్. ఈ సిరీస్ ఈ సంవత్సరం చివరి భాగంలో లాంచ్ చేయబడుతుందని అంచనాలున్నాయి. బహుశా ఈ సంవత్సరంలో జరిగే రెండవ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ చేయవచ్చు. దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

ఫిబ్రవరి 1, 2023న జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ తన గెలాక్సీ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ల మోడళ్ళు అయిన గెలాక్సీ బుక్3 ప్రో, గెలాక్సీ బుక్3 ప్రో 360 మరియు గెలాక్సీ బుక్3 అల్ట్రా లను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే.శాంసంగ్ గెలాక్సీ బుక్3 అల్ట్రా లాప్ టాప్ 16 అంగుళాల, 120Hz, 3K (2880x1800) డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే తో వస్తుంది. ఈ పరికరం విండోస్ 11 హోమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌ OS తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 2,81,990 ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా ఆఫర్‌లు లేకుండా ఈ ధర నిర్ణయించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab S9 Ultra Expected To Feature With Snapdragon 8 Gen 2 SoC, Other Specifications leaked.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X