Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!

By Maheswara
|

శాంసంగ్ తన రాబోయే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2023 (Samsung Galaxy Unpacked 2023 ) ఈవెంట్‌లో తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. USAలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని మసోనిక్ ఆడిటోరియంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11.30 గంటలకు ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈవెంట్ లో లాంచ్ కాబోయే గాడ్జెట్లు మరియు పరికరాలకు సంబందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

 
Samsung Galaxy Unpacked 2023 Event : How To Watch Live Stream And Timings Details In Telugu.

శాంసంగ్ అన్‌ప్యాక్డ్ 2023 ఈవెంట్ లైవ్ ఎలా చూడాలి?

 

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ను శామ్‌సంగ్ తమ అధికారిక వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌ ఖాతా ల ద్వారా ఈ రోజు (ఫిబ్రవరి 1వ తేదీ) రాత్రి 11:30 గంటలకు లైవ్ స్ట్రీమ్ చేయబడుతుంది. ఈ ఈవెంట్ మయంలో, కంపెనీ గెలాక్సీ S23, గెలాక్సీ S23+ మరియు గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్లను ప్రకటిస్తుంది అని తెలుస్తోంది.ఇవి కాక ఇంకా, ఈ బ్రాండ్ యొక్క అప్డేట్ చేయబడిన డిజైన్ మరియు మెరుగైన పనితీరుతో వచ్చే నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ నోట్‌బుక్‌లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్ల నుండి ఏమి ఆశించవచ్చు?

డిజైన్ పరంగా, గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు, ముందు తరం గెలాక్సీ S22 సిరీస్ లాగానే ఉంటాయి, మరీ ముఖ్యంగా అల్ట్రా మోడల్‌ లో ఎక్కువ తేడాలు కనిపించకపోవచ్చు. గెలాక్సీ S23 అల్ట్రా లో 200MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 100x వరకు హైబ్రిడ్ జూమ్ సపోర్ట్‌తో రెండు 10MP టెలిఫోటో లెన్స్‌లతో వెనకవైపు కెమెరా డిజైన్ కలిగి ఉంటుంది.

Samsung Galaxy Unpacked 2023 Event : How To Watch Live Stream And Timings Details In Telugu.

గెలాక్సీ S23 మరియు గెలాక్సీ S23+ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. వీటిని గెలాక్సీ S22 మరియు S22+ తో పోల్చినప్పుడు, గెలాక్సీ S22 అల్ట్రా లాగానే కెమెరా డిజైన్ బంప్‌లను కలిగి ఉంటాయి. ఇది డిజైన్ ను ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.

గెలాక్సీ S23 సిరీస్ ర్యామ్ మరియు స్టోరేజీ వివరాలు

అలాగే, గెలాక్సీ S23 సిరీస్ యొక్క మూడు వేరియంట్‌ల ఫోన్లు కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటాయి. గెలాక్సీ S23 మరియు గెలాక్సీ S23+ ఫోన్లు కనీసం 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తాయి, గెలాక్సీ S23 అల్ట్రా
వేరియంట్ కనీసం 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని అంచనాలున్నాయి.

Samsung Galaxy Unpacked 2023 Event : How To Watch Live Stream And Timings Details In Telugu.

ఇక ఈ ఫోన్ల యొక్క డిస్ప్లే విభాగానికి వస్తే, గెలాక్సీ S23 మరియు S23+ వేరియంట్ లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. అదేవిధంగా, గెలాక్సీ S23 అల్ట్రా అదే 120Hz రిఫ్రెష్ రేట్‌తో QHD+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ భద్రత తో వస్తుంది. ఇటీవల లీక్ ల లో చెప్పినట్లు గా, గెలాక్సీ S23 సిరీస్ మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్ నాణ్యతతో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కూడా కలిగి ఉంటుంది.

గెలాక్సీ S23 సిరీస్ ఫోన్ల ధర పై అంచనాలు

గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లలో కస్టమ్ OneUI 5.1 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 13 OS ను కలిగి ఉన్తయి అని తెలుస్తోంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లు కనీసం మూడు సంవత్సరాలు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను అందుకుంటాయని భావిస్తున్నారు. ఈ కొత్త ఫోన్లను గెలాక్సీ S22 సిరీస్‌తో పోల్చినప్పుడు గెలాక్సీ S23 సిరీస్ బేస్ మోడల్‌కు కనీసం 7,000 రూపాయల వరకు ధర పెరుగుతుందని లీక్ అయిన వివరాలు సూచిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Unpacked 2023 Event : How To Watch Live Stream And Timings Details In Telugu.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X