Galaxy Unpacked 2025 ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈవెంట్ తేదీని ప్రకటించిన శాంసంగ్..!
శాంసంగ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ (Samsung Galaxy Unpacked 2025) తేదీ వెల్లడైంది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. దీంతోపాటు మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 22 వ తేదీన (Galaxy Unpacked 2025 Date in india) నిర్వహించనున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ ఈ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం జనవరి 22 వ తేదీ 11:30PM గంటలకు ప్రారంభం కానుంది. శాంసంగ్ న్యూస్‌రూం, samsung.com, శాంసంగ్ యూట్యూబ్ ద్వారా లైవ్ చూడవచ్చు.

ముందస్తు రిజర్వ్ చేసుకోవచ్చు :
భారత్ యూజర్ల కోసం శాంసంగ్ కీలక ప్రకటన చేసింది. ముందస్తు రిజర్వ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. రూ.1999 చెల్లించి వీఐపీ పాస్‌ను పొందవచ్చని.. కొనుగోలు సమయంలో రూ.5000 వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.
ఏమేం విడుదల కానున్నాయి! :
ఈ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో (Galaxy Unpacked 2025) గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని వివరాలు కూడా వెల్లడయ్యాయి. దీంతోపాటు గెలాక్సీ రింగ్ 2 ను ఆవిష్కరించే అవకాశం ఉంది. మరియు XR హెడ్‌సెట్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
A true AI companion is coming. Join us at Samsung Galaxy Unpacked on January 22, 2025 at 11:30 PM. Get benefits up to ₹ 5000*.
— Samsung India (@SamsungIndia) January 6, 2025
Pre-reserve now: https://t.co/hJy41emhnH. *T&C apply. #GalaxyAI #GalaxyUnpacked #Samsung pic.twitter.com/xqp0I3RGeb
గెలాక్సీ రింగ్ 2 (Galaxy Ring 2) ను అనేక అప్‌గ్రేట్‌లతో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. గతంలో 9 సైజుల్లో అందుబాటులో ఉండగా.. అదనంగా మరో రెండు సైజుల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. గెలాక్సీ రింగ్‌తో పోలిస్తే మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ గత వెర్షన్‌లతో పోలిస్తే మెరుగైన డిస్‌ప్లే, కెమెరా టెక్నాలజీ, బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. స్లీక్ గ్లాస్, మెటల్ బాడీతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఈ సిరీస్ టాప్ ఎండ్ వేరియంట్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుందని సమాచారం.
తాజా లీక్‌ల ఆధారంగా గెలాక్సీ S25 సిరీస్ ఐఫోన్ తరహా Magsafe ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ 4000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అదే గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా మోడళ్లు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








