శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ తేదీ వచ్చేసింది.. ఏయే ఉత్పత్తులు విడుదల కానున్నాయంటే?
Galaxy Unpacked 2025 : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 తేదీని ప్రకటించింది. ఇటీవలే ఈ ఈవెంట్‌కు గురించి లీక్స్ వచ్చాయి. తాజాగా శాంసంగ్ అధికారిక ప్రకటన చేసింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో భాగంగా కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను కూడా పంపుతోంది. ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లతోపాటు బడ్స్, స్మార్ట్‌వాచ్ సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎప్పుడు జరగనుంది? :
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 భారత కాలమానం ప్రకారం జులై 9 వ తేదీ 7:30 PM IST గంటలకు ప్రారంభం కానుంది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ లో జరగనుంది. ఈవెంట్‌ను శాంసంగ్ వెబ్‌సైట్, శాంసంగ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వీక్షించవచ్చు.

ఏయే ఉత్పత్తులు లాంచ్ అయ్యే అవకాశం ఉంది?
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు గెలాక్సీ వాచ్ 8 సిరీస్, గెలాక్సీ బడ్స్ కోర్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే సంస్థ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
శాంసంగ్ తాజా టీజర్ ఆధారంగా లేటెస్ట్ ఏఐ ఇంటర్‌ఫేస్‌తో కొత్త తరం గెలాక్సీ పరికరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే గతంలో వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా ఫోల్డబుల్ ఫోన్‌లు లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు.
గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ సన్నని మరియు తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు అడ్వాన్స్‌డ్ ఫోల్డబుల్ ఫోన్ గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 7 కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఈ రెండు మోడల్స్ ఇటీవల లాంచ్ అయిన Exynos 2500 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. గెలాక్సీ ఫోల్డ్ 7 మోడల్ 8.2 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE మోడల్ పైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇవి కూడా? :
శాంసంగ్ ఫోల్డబుల్ మోడల్స్‌తోపాటు గెలాక్సీ వాచ్ 8, వాచ్ 8 క్లాసిక్ మరియు వాచ్ అల్ట్రా (2025) కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు గెలాక్సీ బడ్స్ కోర్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే దీనికి సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేసింది.
దీంతోపాటు గూగుల్, శాంసంగ్ భాగస్వామ్యంలో XR హెడ్‌సెట్ తోపాటు శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ అభివృద్ధి పై గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కీనోట్ లో ప్రస్తావించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే శాంసంగ్ మాత్రం ఈ ఈవెంట్‌లో ఏయే ఉత్పత్తులను లాంచ్ చేయనుందనే సమాచారం వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications