Home
News

శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 తేదీ వెల్లడి... స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌ సహా కీలక ప్రకటనలు..!!

శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 (Samsung Galaxy Unpacked Event 2024) పై ఎట్టకేలకు ప్రకటన వచ్చింది. ఈ ఈవెంట్‌ పై గతంలో అనేక లీక్‌లు వచ్చాయి. జులైలోనే ఈ ఈవెంట్‌ ను నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ప్రకటన వచ్చింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 జులై 10న పారిస్‌ లో జరగనుంది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ లను విడుదల సహా కీలక ప్రకటనలు చేయనుందని తెలుస్తోంది.

లైవ్‌ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది :
ఈ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024.. ఈ సంవత్సరం పారిస్‌ లో జరగనుంది. ఈ ఈవెంట్‌ ను శాంసంగ్‌ వెబ్‌ సైట్‌ (Samsung.com), శాంసంగ్‌ న్యూస్‌ రూం, శాంసంగ్ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌ చూడవచ్చు. జులై 10వ తేదీ 6.30PM గంటలకు భారత్‌లో ఈ లైవ్‌ ప్రారంభం కానుంది.

samsung galaxy unpacked event 2024 willbe on july 10 expected launches and announcements

ఏమేం విడుదలయ్యే అవకాశం ఉంది :
శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 లో గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 విడుదలయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ AI తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే ఈవెంట్‌ లో గెలాక్సీ బడ్స్‌ 3 సిరీస్‌ పైన ప్రకటన చేసే అవకాశం ఉంది. మరియు గెలాక్సీ రింగ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

తొలిసారిగా అల్ట్రా మోడల్‌ను ఆవిష్కరించే ఛాన్స్‌ :
దీంతోపాటు ఇతర గ్యాడ్జెట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. శాంసంగ్‌ తొలిసారిగా అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌వాచ్‌ ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7 విడుదలపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

గెలాక్సీ AI :
శాంసంగ్‌ AI ను తన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లలో ఈ సాంకేతికను తీసుకురానుంది. అనంతరం తన పాత ఫోన్లలోనూ ఈ AI ను ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. దీంతోపాటు ఇతర గ్యాడ్జెట్‌లు కూడా గెలాక్సీ AI తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు లీకైన వివరాల ఆధారంగా.. శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 256GB, 512GB, 1TB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు నేవీ, సిల్వర్‌ షాడో, పింక్ రంగుల్లో లభించనుందని సమాచారం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
samsung galaxy unpacked event 2024 date announced expected launches details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X