శామ్‌సంగ్ అన్ ప్యాకెడ్ లాంచ్ ఈవెంట్ తేదీని ప్రకటించింది!! కొత్త ప్రొడెక్టులు లాంచ్...

|

ప్రపంచం మొత్తం మీద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో శామ్‌సంగ్ మరియు ఆపిల్ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆపిల్ సంస్థ 2021 లో తన అక్టోబర్ ఈవెంట్ తేదీని మంగళవారం ప్రకటించిన వెంటనే దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు శామ్‌సంగ్ కూడా ఈ సంవత్సరం తన రెండవ గెలాక్సీ అన్ ప్యాకెడ్ ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ పద్దతిలో జరిగే ఈ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 20 న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం శామ్‌సంగ్ సంస్థ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఉదయం 7 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆపిల్ మరియు గూగుల్ తమ ఈవెంట్‌ని వరుసగా అక్టోబర్ 18 మరియు అక్టోబర్ 19 న నిర్వహిస్తాయి. శామ్‌సంగ్ గెలాక్సీ అన్ ప్యాకెడ్ ఈవెంట్ పార్ట్ 2 కోసం కొత్త ఆహ్వానం ఇది "టెక్నాలజీ ద్వారా స్వీయ వ్యక్తీకరణ కోసం కొత్త అనుభవాలను తెరుస్తుంది". దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Samsung Galaxy S21 FE అంచనా

Samsung Galaxy S21 FE అంచనా

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు యొక్క ఈవెంట్‌ లాంచ్ కు సంబందించి తరచు పుకార్లు వస్తున్నాయి. ఈవెంట్ లో గెలాక్సీ S21 FE లేదా కొత్త మిడ్-రేంజ్ పరికరాలను లాంచ్ చేయవచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. గెలాక్సీ S21 FE క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని నివేదించబడింది. కానీ సరఫరా సమస్యల కారణంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అంతర్గత ఎక్సినోస్ చిప్‌లను కూడా ఉపయోగించవచ్చు.

Flipkart Big Billion Days సేల్ కారణంగా రూ.11500 కోట్లు ఆదా చేశారు ! వివరాలు చూడండి.Flipkart Big Billion Days సేల్ కారణంగా రూ.11500 కోట్లు ఆదా చేశారు ! వివరాలు చూడండి.

స్మార్ట్‌ఫోన్
 

ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు గెలాక్సీ S 21 FE ని తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లతో ఆగస్టులో జరగనున్న ఆన్‌లైన్ ఈవెంట్‌లో ఆవిష్కరించాలని భావించారు. అయితే మార్కెట్ వీక్షకులు ఇప్పుడు గెలాక్సీ S21 FEని ఈ నెలలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గెలాక్సీ S21 FE అనేది జనవరిలో విడుదలైన గెలాక్సీ S21 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఎడిషన్. దీని ధర (US $ 610) పరిధిలో ఉంటుందని అంచనా.

గెలాక్సీ S21 FE

గెలాక్సీ S21 FE స్పెసిఫికేషన్‌ల గురించి శామ్‌సంగ్ ఇంకా ఎలాంటి సమాచారాన్ని ధృవీకరించలేదు. అయితే 120 టెక్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.4-అంగుళాల డిస్‌ప్లేతో ఇది వస్తుందని విదేశీ టెక్ సమీక్షకులు అంచనా వేశారు. శామ్‌సంగ్ మునుపటి అన్ప్యాక్డ్ ఈవెంట్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3, గెలాక్సీ Z ఫ్లిప్ 3, లేటెస్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4 మరియు గెలాక్సీ బడ్స్ 2 యొక్క కొత్త బడ్లను ప్రకటించింది.

గెలాక్సీ S21 FE లీక్స్

గెలాక్సీ S21 FE లీక్స్

శామ్‌సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే గెలాక్సీ S21 FE 4G మాదిరిగానే వెనుకవైపున కెమెరా ప్లేస్‌మెంట్‌ను కలిగి ఉంది. అయితే ఇది ఆరు విభిన్న కలర్ ఎంపికలతో రంగురంగుల స్మార్ట్‌ఫోన్ గా అందుబాటులోకి రానున్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లీక్ల ఆధారంగా గెలాక్సీ S21 FE 5G బ్లూ, గ్రీన్, పింక్, గోల్డ్, రెడ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో రానున్నది. గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 990 SOC (5G) చిప్ సెట్ ను కలిగి ఉండి శక్తిని పొందుతూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Unpacked Event Date Announced!! October 20 Could Launch Galaxy S21 FE Smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X