వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లతో, Samsung నుంచి కొత్త స్మార్ట్ వాచ్ లు లీక్!
శాంసంగ్ నుంచి Galaxy Watch 7 సిరీస్‌ని రాబోయే అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు నివేదికలు వెలుబడ్డాయి.ఈ కొత్త సమాచారం తో నివేదికలు పరిశీలిస్తే, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) సర్టిఫికేషన్‌లో కూడా Samsung Galaxy Watch 7 ని గుర్తించాము.
దీనితో పాటు, FCCలో మరొక గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌ని కూడా గుర్తించాము, అది Samsung Galaxy Watch FE కావచ్చు. వీటి యొక్క పూర్తి వివరాలను ఇక్కడ పరిశీలించండి.

SM-L300, SM-L305, SM-L310 మరియు SM-L315 అనే మోడల్ నంబర్‌లతో రాబోయే శాంసంగ్ గెలాక్సీ వాచీ లు FCC సర్టిఫికేషన్‌లో గుర్తించబడ్డాయి. SM-L300 మరియు SM-L310 మోడల్ నంబర్‌లతో కూడిన గెలాక్సీ వాచీలు WiFi కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి మరియు 40mm మరియు 44mm వ్యాసాలను కలిగి ఉండవచ్చు. SM-L305 మరియు SM-L315 SM-L300 మరియు SM-L310 యొక్క LTE కనెక్టివిటీ వేరియంట్‌లు ఉండవచ్చు.
అలాగే, SM-L305 మోడ్ నంబర్‌తో కూడిన శాంసంగ్ గెలాక్సీ వాచ్ FCC లిస్టింగ్ ప్రకారం 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే ఇది 50% వేగవంతమైనది.
వివరాలు గమనిస్తే, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 మరియు వాచ్ 6 సిరీస్‌లు 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. FCC జాబితా ఛార్జర్ యొక్క మోడల్ నంబర్‌ను కూడా ఇది వెల్లడించింది. ఇది EP-OL300 మోడల్ నెంబర్ తో వస్తుంది.
ఇంకా, శాంసంగ్ గెలాక్సీ వాచ్ FE మోడల్ నంబర్ SM-R861 గా ఉంది. డాక్యుమెంట్ ల ప్రకారం, ఇది 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతును కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 లాగానే. అంతే కాకుండా, FCC జాబితాలు రాబోయే స్మార్ట్‌వాచ్‌ల గురించి ఏమీ వెల్లడించలేదు. అయితే, ఇవి లాంచ్ కి ముందు ఇతర డాక్యుమెంట్ లపై కూడా కనిపిస్తాయని ఆశించవచ్చు.
ఇటీవల, రాబోయే ఈ ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క లీకైన CAD రెండర్ డిజైన్ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ కొత్త రెండర్ లు గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క డిజైన్ దాని పూర్వీకుల నుండి భిన్నంగా ఉంటుందని సూచిస్తుంది.
లీక్ అయిన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అంచనా స్పెసిఫికేషన్‌ల వివరాలు ప్రకారం, గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 7.6-అంగుళాల లోపలి మరియు 6.2-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో, 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 256GB, 512GB మరియు 1TB స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. ఇది, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,400mAh బ్యాటరీని కలిగి ఉంటుందని ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి.ఇక రంగుల వేరియంట్ లను గమనిస్తే, ఈ ఫోల్డబుల్ పరికరం లేత గులాబీ, క్రాఫ్టెడ్ బ్లాక్, సిల్వర్ షాడో, వైట్ మరియు నేవీ (డార్క్ బ్లూ) రంగులలో టీజ్ చేయబడింది.


Click it and Unblock the Notifications








