Galaxy Z Fold 2 స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ మరో 2రోజులలో మొదలుకానున్నాయి!!!
ఇండియా యొక్క స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో శామ్‌సంగ్ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఈ సంస్థ ఎల్లప్పుడూ తన వినియోగదారులకు సరికొత్త టెక్నాలజీలతో కొత్త రకం స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నది. దీని యొక్క పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు కొత్తగా గెలాక్సీ Z ఫోల్డ్ 2 5Gను ప్రకటించింది. ఇప్పుడు దీనిని ముందుగా బుక్ చేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. 2020 సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనిని ప్రీ-బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 2 ప్రీ-బుకింగ్ ఆఫర్స్
శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రీ-బుకింగ్ ఇండియాలో సెప్టెంబర్ 14 నుండి శామ్సంగ్ వెబ్‌సైట్ మరియు కొన్ని రిటైలర్ల ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసును పొందే వినియోగదారులకు సంస్థ కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నది. ఇందులో భాగంగా దీనిని బుక్ చేసుకున్న వారికి నాలుగు నెలల యూట్యూబ్ ప్రీమియం సర్వీసును ఉచితంగా అందించడంతో పాటుగా ఆఫీస్ 365 చందాపై 22 శాతం తగ్గింపును కూడా అందిస్తుంది. అలాగే 12 నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది. అయితే ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఎప్పుడు మొదలవుతాయి అనేది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ధరల వివరాలు
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 అనేది ఫోల్డబుల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేయడంలో శామ్‌సంగ్ సంస్థ చేసిన రెండవ ప్రయత్నం. ఈ కొత్త ఫోన్ పాత దానికంటే మెరుగైన ఎడ్జ్-టు-ఎడ్జ్ కవర్ డిస్ప్లేని కలిగి ఉంది. ఇండియాలో గెలాక్సీ Z ఫోల్డ్ 2 ను రూ.1,49,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మిస్టిక్ బ్లాక్ మరియు మిస్టిక్ బ్రోన్స్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఫోన్ వెలుపల 6.2-అంగుళాల ఇన్ఫినిటీ-ఓ స్క్రీన్‌లో మరియు లోపలి భాగంలో 7.6-అంగుళాల స్క్రీన్‌లో 120HZ రిఫ్రెష్ రేట్‌తో "సున్నితమైన స్క్రోలింగ్ మరియు గేమ్‌ప్లే" ని అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 2019లో విడుదలైన గెలాక్సీ ఫోల్డ్ యొక్క అప్ డేట్ వెర్షన్ గా విడుదల కానున్నది. ఈ ఫోల్డ్ 2 ఫోన్ 7.6-అంగుళాల పెద్ద డిస్ప్లేని 1768 x 2208 పిక్సెల్ పరిమాణంలో వస్తుంది. దీని డిస్ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేటు మద్దతును కలిగి ఉంది. వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలోని కెమెరా పంచ్-హోల్ కటౌట్ నిర్మాణంలో కలిగి ఉంది. 2019 మోడల్ మాదిరిగా కాకుండా ఫోల్డ్ 2 ప్లాస్టిక్‌కు బదులుగా డిస్ప్లే కోసం అల్ట్రా-సన్నని గాజును ఉపయోగిస్తుంది. ఫోన్ ను మడిచినప్పుడు 6.2-అంగుళాల రిజల్యూషన్‌తో 816 x 2260 పిక్సెల్‌ల డిస్ప్లేని కలిగి ఉంటుంది.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 చిప్‌సెట్ ఫీచర్
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్‌తో రన్ అవుతూ 12GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే ఇది 4500mah అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. పెద్ద డిస్ప్లే ను కలిగి ఉండి మల్టీ టాస్కింగ్‌కు సహాయపడటానికి అదనపు మెరుగుదలలతో ఫోల్డ్ 2 శామ్‌సంగ్ యొక్క OneUI 2.5 లో రన్ అవుతుంది.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో మూడు కెమెరాలు కూడా 12-మెగాపిక్సెల్ సెన్సార్ లను కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి వైడ్ యాంగిల్ మరియు మరొకటి అల్ట్రా-వైడ్ యాంగిల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. మూడవ కెమెరా టెలిఫోటో యూనిట్ లెన్స్ లను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ రెండు కెమెరాలు ఒక్కొక్కటి 10 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications