Samsung గెలాక్సీ Z ఫోల్డ్ 3, Z ఫ్లిప్ 3 ప్రీ-బుకింగ్‌పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...

|

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 లను గ్లోబల్ లాంచ్ అయిన కొద్ది రోజుల తర్వాత భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ యొక్క ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్‌లు ఇండియాలో రూ.88,999 ప్రారంభ ధర వద్ద రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడ్డాయి. అయితే శామ్‌సంగ్ సంస్థ వీటిని కొనుగోలు చేయడం కోసం వినియోగదారులకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ముందస్తుగా బుకింగ్ చేసుకోవడానికి ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నది. కొత్తగా విడుదలైన రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ ఫోల్డ్ 3 5G ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరల విషయానికి వస్తే ఇది ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ స్టాండర్డ్ వేరియంట్ యొక్క ధర రూ.1,49,999. టాప్ ఎండ్ మోడల్ 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ మోడల్ యొక్క ధర రూ.1,57,999. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ గ్రీన్‌ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వీడియో & వాయిస్ కాల్‌ల భద్రత కోసం సరికొత్త అప్‌డేట్ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వీడియో & వాయిస్ కాల్‌ల భద్రత కోసం సరికొత్త అప్‌డేట్

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5G కూడా ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.84,999 కాగా, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ రూ.88,999 ధర వద్ద విడుదలైంది. ఈ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫాంటమ్ బ్లాక్ మరియు క్రీమ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది.

Mi నోట్‌బుక్ కొత్త ల్యాప్‌టాప్ ఫీచర్స్ లీక్!! రియల్‌మికి పోటీగా...Mi నోట్‌బుక్ కొత్త ల్యాప్‌టాప్ ఫీచర్స్ లీక్!! రియల్‌మికి పోటీగా...

గెలాక్సీ Z ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 ప్రీ-బుకింగ్‌ వివరాలు

గెలాక్సీ Z ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 ప్రీ-బుకింగ్‌ వివరాలు

శామ్సంగ్ సంస్థ కొత్తగా విడుదల చేసిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ రెండింటికీ కూడా లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 లేదా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5G ని రూ. 7,000 అప్‌గ్రేడ్ వోచర్‌తో ముందే బుక్ చేసుకోవచ్చు లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ఉపయోగించి రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5G మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ముందస్తు ప్రీ-బుకింగ్‌పై రూ.7,999 విలువైన శామ్‌సంగ్ కేర్+ యాక్సిడెంటల్ & లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కోసం వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు ఉచిత అర్హత ఉంటుందని శామ్‌సంగ్ ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటికే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 లేదా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ప్రీ-రిజర్వ్ చేసిన వినియోగదారులు ఉచిత గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్‌తో పాటు అన్ని ప్రీ-బుకింగ్ ఆఫర్‌లకు అర్హులవుతారని గమనించాలి.

 

గెలాక్సీ Z ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 సేల్స్ వివరాలు

గెలాక్సీ Z ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 సేల్స్ వివరాలు

భారతదేశంలో లాంచ్ అయిన శామ్సంగ్ యొక్క కొత్త రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు Samsung.com మరియు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 9 వరకు ముందుగా బుక్ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్10 నుండి వీటి యొక్క సేల్స్ మొదలవుతాయి.

గెలాక్సీ Z ఫోల్డ్ 3 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ Z ఫోల్డ్ 3 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 పై UI తో రన్ అవుతుంది. ఇది 7.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేని 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో ఫీచర్ చేయబడింది. మరొకటి 6.2-అంగుళాల HD+ (832x2,268 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద ఇది 5nm ఆక్టా-కోర్ SoC ని 12GB RAM తో జత చేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికొస్తే శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు టెలిఫోటో లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ఇది డ్యూయల్ OIS మద్దతును కలిగి ఉంది మరియు 2x ఆప్టికల్ జూమ్ మరియు HDR10+ రికార్డింగ్ ను అందిస్తుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 3 సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం దాని కవర్‌పై 10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 80 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉన్న f/2.2 లెన్స్‌తో జత చేయబడి ఉంటుంది. అదనంగా శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 దాని మడత స్క్రీన్ పైన డిస్‌ప్లే కెమెరాను కలిగి ఉంది. కెమెరా 4 మెగాపిక్సెల్ రిజల్యూషన్ మరియు పైన f/1.8 లెన్స్ కలిగి ఉంది. అలాగే ఇది 4,400mAh డ్యూయల్-సెల్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వైర్‌లెస్ మరియు వైర్డ్ ఛార్జింగ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఎనేబుల్ చేస్తుంది. బ్యాటరీకి అనుకూలమైన ఛార్జర్‌ల ద్వారా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ (UWB) మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. Samsung Galaxy S Fold 3 తో S పెన్ సపోర్ట్‌ను జోడించింది.

Samsung Galaxy Z Flip 3 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Z Flip 3 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.7-అంగుళాల ప్రైమరీ ఫుల్-హెచ్‌డి+ (1,080x2,640 పిక్సెల్స్) డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 1.9-అంగుళాల సైజు పెద్ద కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అలాగే ఇది 5nm ఆక్టా-కోర్ SoC తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్ మరియు OIS తో పాటు, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌ని కలిగి ఉంటుంది. అలాగే దాని మడత డిస్‌ప్లే పైన 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను f/2.4 లెన్స్‌తో అందిస్తుంది. అలాగే ఇది 3,300mAh డ్యూయల్ సెల్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు క్వాల్‌కామ్ క్విక్ ఛార్జ్ 2.0 కి అనుకూలంగా ఉంటుంది. ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z Fold 3, Galaxy Z Flip 3 Released in India: Price, Pre-Booking Discount Offers, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X