Samsung గెలాక్సీ Z ఫోల్డ్ 5 ఫోటో లీక్.. ఫీచర్లు, విడుదల తేది వివరాలు..!
శాంసంగ్ జులై చివరలో ఓ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో తన కొత్త ఫోన్లను ప్రదర్శించనుంది. ఈ జాబితాలో ఫోల్డింగ్, ప్లిప్ ఫోన్లు గెలాక్సీ Z ఫోల్డ్ 5 మరియు Z ప్లిప్ 5, గెలాక్సీ వాచ్ 6 సీరిస్ మరియు గెలాక్సీ బడ్స్ 3 ప్రో ఉన్నాయి.
జులైలో శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. మైస్మార్ట్‌ప్రైస్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 ఫోన్ ఫోటో లీక్ అయింది. ఈ రెండు ఓరియంటేషన్‌లను కలిగి ఉంది. మరియు సన్నని అంతర్గత బెజెల్స్‌ను కలిగి ఉంది. రీడిజైన్ చేయబడిన ప్లాష్‌తో రానుంది.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల పుల్ హెచ్‌డీ+ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 7.6 అంగుళాల QHD+ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. రెండు డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండనుంది.
గెలాక్సీ Z ఫోల్డ్ 5 మరియు Z ఫోల్డ్ 5 ఫోన్లు స్నాప్ డ్రాగన్ 8 జెన్2 ప్రొసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే గెలాక్సీ Z ఫోల్డ్ 5 ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఆల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలీఫోటో కెమెరాలు, మరియు 12MP సెల్ఫీ కెమెరాతో తో రానున్నట్లు సమాచారం.
అలాగే Z ప్లిప్5 డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. గెలాక్సీ Z ఫోల్డ్ 5 4400mAh బ్యాటరీ సామర్థ్యంతో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ S పెన్‌తో రానున్నట్లు సమాచారం.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ 8GB/ 12GB ర్యామ్, మరియు 256GB /512GB /1TB వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 ఆధారంగా పనిచేయనుందని సమాచారం.
గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ IP58 రేటింగ్‌తో రానుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ మొత్తం ఐదు రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బ్లూ, ప్లాటినం, లేత గోధుమ, బ్లాక్, లేత బ్లూ రంగుల్లో వచ్చే రానుందని సమాచారం. శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ కార్యక్రమం ఈసారి దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరుగుతుంది. తొలిసారి శాంసంగ్ ఈవెంట్ స్వదేశంలో జరగనుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications