Home
News

Samsung కొత్త ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ లీక్ అయింది! మరింత పెద్ద డిస్ప్లే రాబోతోంది

శాంసంగ్ సంస్థ Samsung Galaxy Z Fold 5 ని గత సంవత్సరం లాంచ్ చేసింది మరియు ఇప్పుడు ఈ ఫోన్ యొక్క సక్సెసర్‌ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. Samsung Galaxy Z Fold 6 గురించి కంపెనీ ఎలాంటి కీలక వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇటీవలి కాలంలో అనేక పుకార్లు మరియు ఊహాగానాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

రాబోయే ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క లీకైన CAD రెండర్ డిజైన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ కొత్త రెండర్ లు గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క డిజైన్ దాని పూర్వీకుల నుండి భిన్నంగా ఉంటుందని సూచిస్తుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క డిజైన్ యొక్క అంచనా వివరాలను చూడండి.

Samsung Galaxy Z Fold 6

Samsung Galaxy Z ఫోల్డ్ 6 CAD రెండర్ డిజైన్
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క లీకైన మొదటి డిజైన్ ఫోటోలు గెలాక్సీ Z ఫోల్డ్ 5 మాదిరిగానే కవర్ స్క్రీన్ బెజెల్‌లను కలిగి ఉన్నాయి. అయితే, SamMobile US-ఆధారిత కేస్ తయారీదారు థిన్‌బోర్న్‌తో కలిసి వచ్చిన లీక్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క CAD రెండర్‌తో ముందుకు వచ్చింది.

ఈ కొత్త లీక్ ప్రకారం, ఈ డిజైన్ మరింత ఏకరీతి లో కవర్ స్క్రీన్ బెజెల్‌లను కలిగి ఉంటుంది.
ఈ కొత్త సమాచారం ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ద్వారా X లో పోస్ట్ చేసిన వీడియో ధృవీకరిస్తుంది.ఈ వీడియోలో ఇదే డిజైన్ ను చూపుతుంది.

Samsung Galaxy Z Fold 6

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అంచనా స్పెసిఫికేషన్‌ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 కోసం అధికారికంగా ఇంకా ఎలాంటి ఫీచర్లు లేదా స్పెసిఫికేషన్‌లను ప్రకటించలేదు. ఏది ఏమైనప్పటికీ, రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి అనేక పుకార్లు మరియు ఊహాగానాలు ఇటీవలి కాలంలో కనిపించాయి. ఇది ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్లను సూచిస్తుంది.

లీక్ అయిన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అంచనా స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఇటీవలి లీక్‌ల ప్రకారం, గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 7.6-అంగుళాల లోపలి మరియు 6.2-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో, 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది
.
ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 256GB, 512GB మరియు 1TB స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. ఇది, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,400mAh బ్యాటరీని కలిగి ఉంటుందని ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి.ఇక రంగుల వేరియంట్ లను గమనిస్తే, ఈ ఫోల్డబుల్ పరికరం లేత గులాబీ, క్రాఫ్టెడ్ బ్లాక్, సిల్వర్ షాడో, వైట్ మరియు నేవీ (డార్క్ బ్లూ) రంగులలో టీజ్ చేయబడింది.

లాంచ్ తేదీ ఎప్పుడనే విషయం ఇంకా దృవీకరించనప్పటికీ, శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ అవుతుందని అంచనా ఉంది. ఈ ఈవెంట్, పారిస్‌లో జూలై 10న జరిగే అవకాశం ఉంది.

ఇందులో, శాంసంగ్ యొక్క గెలాక్సీ Z ఫోల్డ్ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 6 తో పాటు గెలాక్సీ బడ్స్ 3, గెలాక్సీ వాచ్ 7 సిరీస్, గెలాక్సీ రింగ్ మరియు గెలాక్సీ ట్యాబు S10 సిరీస్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అదనంగా, కొత్త శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అల్ట్రా కూడా రావొచ్చని అంచనాలున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z Fold 6 Design Render Leaked. Design Shows Bigger Outer Display. Leaked Specs Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X