Home
News

శాంసంగ్‌ Galaxy Z Fold 5, Flip 5 ఫోన్ల విడుదల తేదీ ఖరారు.. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం

శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Galaxy Z Fold 5 మరియు Flip 5 స్మార్ట్‌ఫోన్ల విడుదల ఖరారు అయింది. జులై 26 నిర్వహిస్తున్న Galaxy Unpacked కార్యక్రమంలో ఈ రెండు ఫోన్లు విడుదల చేస్తునట్లు శాంసంగ్‌ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ కార్యక్రమo తొలిసారిగా దక్షిణ కొరియాలో నిర్వహించనుంది.

కొన్ని నివేదికల ప్రకారం శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 5 మరియు Z ఫ్లిప్‌ 5 ఫోన్లతో పాటు ఓ ట్యాబ్‌ మరియు స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలో లాంచ్‌ కానున్న డివైజ్‌లను ముందుగానే బుక్‌ చేసుకొనే సౌకర్యాన్ని శాంసంగ్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.

samsung Galaxy Z Fold 5 Flip 5 smartphones launch

శాంసంగ్‌ ప్రకటన ప్రకారం జులై 26 సాయంత్రం 4:30 గంటలకు గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ కార్యక్రమం శాంసంగ్‌ సంస్థ తన స్వదేశం అయిన దక్షిణ కొరియాలోని సియోల్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌గా చూసేందుకు శాంసంగ్‌ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానళ్లను సందర్శించాలని కోరింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన తొలి గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమంలో గెలాక్సీ S23 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లు మరియు గెలాక్సీ బుక్‌ 3 సీరిస్‌ను లాంచ్‌ చేసింది. జులై 26న రెండవ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమంలో శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 5 మరియు Z ఫ్లిప్‌ 5 ఫోన్లు విడుదల కానున్నాయి.

samsung Galaxy Z Fold 5 Flip 5 smartphones launch

ఈ శాంసంగ్ అన్‌ప్యాక్డ్‌ వేడుకలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్‌ ఫోల్డింగ్‌, ఫ్లిప్‌ ఫోన్లతో పాటు ప్లాగ్‌షిప్‌ మోడల్‌ ట్యాబ్లెట్‌లను లాంచ్‌ చేయనుంది. గెలాక్సీ Tab S9, Tab S9 ప్లస్‌ మరియు Tab S9 ఆల్ట్రా విడుదల కానున్నాయని సమాచారం.

శాంసంగ్‌ గెలాక్సీ Z Flip 5 6.7 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఆక్టా కోర్‌ క్కాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేయనుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3,700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది.

samsung Galaxy Z Fold 5 Flip 5 smartphones launch

శాంసంగ్‌ గెలాక్సీ Z Fold 5 స్మార్ట్‌ఫోన్ 7.6 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. వన్‌ UI 5.1 ఆధారిత ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేయనుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్‌ 4,400mAh బ్యాటరీ సామర్థ్యంతో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానుందని తెలుస్తోంది.

శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్లను ముందుగా రిజర్వ్‌ చేసుకొనే అవకాశాన్ని శాంసంగ్‌ కల్పించింది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌, స్టోర్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 చెల్లించి ఫోన్లను రిజర్వ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ముందుగా రిజర్వ్‌ చేసుకున్న వినియోగదారులు రూ.5000 విలువైన ప్రయోజనాలు పొందుతారని శాంసంగ్‌ వెల్లడించింది.

* శాంసంగ్‌ ఇవాళ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. సంస్థ ఈ ఫోన్‌ను శామ్‌సంగ్‌ సిగ్నేచర్‌ డిజైన్‌ అని పిలుస్తోంది. ఫోన్‌ డిజైన్‌ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.16999 నుంచి ప్రారంభం అవుతుంది. మూడు రంగుల్లో లభిస్తుంది. ప్రిజం సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లూ మరియు వాటర్‌ఫాల్‌ బ్లూ రంగుల్లో వస్తుంది. జులై 16 నుంచి అమెజాన్‌ మరియు శాంసంగ్‌లో సేల్‌ ప్రారంభం అవుతుంది.

Best Mobiles in India

English summary
Samsung has officially announced Galaxy Z Fold 5 and Flip 5 smartphones launch on july 26
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X