శాంసంగ్ హోలీ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ, ఏసీలపై భారీ ఆఫర్లు.. నేటి నుంచే సేల్ ప్రారంభం..!
హోలీ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ కీలక ప్రకటన చేసింది. శాంసంగ్ హోలీ సేల్ (Samsung Holi sale 2024) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపింది.
సేల్ ఎప్పటి వరకు జరగనుందంటే.. : శాంసంగ్ హోలీ సేల్ ఇవాళ (మార్చి 15) నుంచి ప్రారంభం కానుంది. మార్చి 26 వరకు ఈ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.25,000 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. శాంసంగ్ యాప్, శాంసంగ్ వెబ్‌సైట్, సంస్థ స్టోర్లలో మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారని సంస్థ పేర్కొంది.

స్మార్ట్ ఫోన్లపై 60శాతం.. ల్యాప్‌టాప్‌లపై 45శాతం డిస్కౌంట్..!! :
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటన చేసింది. శాంసంగ్ గెలాక్సీ మోడల్ ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చని పేర్కొంది. దీంతోపాటు గెలాక్సీ S, గెలాక్సీ A, గెలాక్సీ Z స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 60 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. దీంతోపాటు ఇతర ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లపై 55 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని తెలిపింది.
ఎంపిక చేసిన టీవీ మోడళ్లపై డిస్కౌంట్ : శాంసంగ్ ప్రీమియం, లైఫ్ స్టైల్ మోడళ్లపై గరిష్ఠంగా 48 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. దీంతోపాటు గరిష్ఠంగా రూ.15,250 వరకు అదనపు ఎక్స్చేంజీ పొందవచ్చని తెలిపింది. Neo OLED కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు కచ్చితంగా కల్పిస్తామని పేర్కొంది.

స్మార్ట్ గ్యాడ్జెట్లతోపాటు రిఫ్రిజిరేటర్లు సహా ఏసీలపైనా ఈ శాంసంగ్ హోలీ సేల్‌లో ఆఫర్లను అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన రిఫ్రిజిరేటర్లపై 49 శాతం పొందవచ్చు. దీంతోపాటు ఈ కస్టమర్లు రూ.15,125 ఎక్చ్సేంజీ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది. శాంసంగ్ విండ్ ఫ్రీ AC మోడళ్లపై 39 శాతం పొందవచ్చు. రెండు కంటే ACలు కొనుగోలు చేస్తే దీంతోపాటు అదనంగా 5 శాతం తగ్గింపును పొందవచ్చు.
వాషింగ్ మెషిన్లపై ఆఫర్లు :
ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లపై గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.15,125 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలు పొందవచ్చని శాంసంగ్ తెలిపింది. దీంతోపాటు గేమింట్, స్మార్ట్ మానిటర్లపైనా శాంసంగ్ ఆకర్షణీయ ఆపర్లను అందిస్తోంది. ఈ సేల్ (Samsung Sale 2024 March) ఇవాళ్టి నుంచి మార్చి 26 వరకు జరగనుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








