మొబైల్ కొనేందుకు శాంసంగ్ లోన్ ఇస్తోంది, ఓ లుక్కేయండి

By Gizbot Bureau
|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో తమ యూజర్ల కోసం బంపర్ ఆఫర్ తీసుకోస్తోంది. ఇండియాలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే తమ కస్టమర్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని ఉద్దేశంలో ఫైనాన్సియల్ ఆప్సన్ ను ఆఫర్ చేసేందుకు రెడీ అయింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొనలేని కస్టమర్లకు స్వయంగా లోన్లు ఇచ్చేందుకు కంపెనీ ప్లాన్ రెడీ చేస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా DMI ఫైనాన్స్ భాగస్వామ్యంతో కస్టమర్లకు శాంసంగ్ ఫైనాన్స్ + లోన్ ఆఫర్ చేస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం.. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు కూడా శాంసంగ్ ఈ లోన్ ఆఫర్ అందిస్తోంది.

జీరో వడ్డీకే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి
 

జీరో వడ్డీకే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి

భారత మొబైల్ మార్కెట్లో తమ వినియోగదారులను పెంచుకునేందుకు సౌత్ కొరియన్ దిగ్గజం ఈ కొత్త లోన్ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. బ్రిక్, మోర్టార్ రిటైలర్లుతో పాటు భారీ ఫార్మాట్ రిటైల్ స్టోర్లలో ఫైనాన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని లేటెస్ట్ రిపోర్టు తెలిపింది. నెలవారీ చెల్లింపులపై జీరో వడ్డీతో కస్టమర్లు స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా శాంసంగ్ ఫైనాన్స్ ఆఫర్ 30 నగరాల్లో 5వేల స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఇదిలా ఉంటే 2019 ఏడాదికి 100 నగరాల్లో 10వేలకు పైగా స్టోర్లను విస్తరించేందుకు శాంసంగ్ ప్రణాళిలు సిద్ధం చేస్తోంది.

లోన్ పొందడం ఎలా ?

లోన్ పొందడం ఎలా ?

ముందుగా యూజర్లు శాంసంగ్ ఫైనాన్స్ + అప్లికేషన్ ఔట్ లెట్ ఇన్ స్టోర్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో కస్టమర్లు తమ వివరాలను ఎంటర్ చేయాలి. కేవైసీ వెరిఫికేషన్ ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగా కస్టమర్లకు ఎంత లోన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఈ ప్రాసెస్ లో కేవలం 25 నిమిషాల్లో లోన్ అప్రూవ్ పూర్తి అవుతుంది.

షియోమి బాటలో 

షియోమి బాటలో 

ఇదిలా ఉంటే ఇంతకు ముందే చైనా దిగ్గజం షియోమి ఇండియాలోని యూజర్లకు రుణాలను అందించేందుకు సిద్ధమైంది. ఇటీవలనే కన్సూమర్ రుణాలు అందిస్తామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే శాంసంగ్ కూడా రుణాలు అందించేందుకు రెడీ అయింది.శాంసంగ్ కంపెనీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.భారత్‌లో ఫోన్ అమ్మకాలు పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. షియోమిని తట్టుకుని, మళ్లీ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం శాంసంగ్ ప్రయత్నిస్తుందని తెలిపారు.

మడతబెట్టే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్
 

మడతబెట్టే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్

ఇదిలా ఉంటే శాంసంగ్‌కు చెందిన మడతబెట్టే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ను అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత మార్కెట్‌లో విక్రయించనుందని సమాచారం. కేవలం ప్రీ-బుకింగ్ విధానంలోనే ఈ ఫోన్‌ను శాంసంగ్ విక్రయించనుందని తెలిసింది. భారత్‌లో గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ రిలీజై ఎంతో కాలమైనప్పటికీ ఇందులో ఉన్న పలు లోపాల వల్ల ఫోన్ మార్కెట్‌లోకి రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే అన్ని లోపాలను సరి చేసిన శాంసంగ్ తన గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌ను గత నెల కిందటే దక్షిణ కొరియా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కాగా గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లో 7.3 ఇంచుల ప్రైమరీ డిస్‌ప్లే, 4.6 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung India offers finance options for smartphone buyers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X