శాంసంగ్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు, నియామకం ఎలా అంటే..?

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో భారీ కొలువులకు తెరలేపింది. ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో దూసుకుపోతున్న ఈ దిగ్గజం భారతీయ ఇంజనీర్లకు శుభవార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది ఇండియాలో దాదాపు 1000 మంది ఉద్యోగులను కంపెనీలోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. వివిధ రంగాల్లోకి ఉద్యోగులను తీసుకోనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియాలోని ప్రముఖ ఇనిస్టిట్యూట్ లలో క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఈ నియామకం చేపడతామని కంపెనీ తెలిపింది.

55 దేశాలను నమ్మించి నిలువు దోపిడి చేస్తున్న చైనా, గత 5ఏళ్ల నుంచి..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్‌ అండ్‌ డీ సెంటర్ల కోసం..

శాంసంగ్ ఇండియా దిగ్గజం దేశవ్యాప్తంగా ఉన్నతమ ఆర్‌ అండ్‌ డీ సెంటర్ల కోసం 1000 మంది ఇంజనీర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది.కాగా టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలనుంచి వీరిని సెలెక్ట్‌ చేస్తామని కంపెనీ తెలిపింది.

ఈ డొమైన‍్లలో నియామకం

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ ధింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బయో మోట్రిక్స్‌, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ, సహజ భాషా సంవిధానం, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మొబైల్ భద్రత, 5జీ నెట్‌వర్క్‌లాంటి డొమైన‍్లలో వీరిని నియమించుకుంటుంది.

300మందిని ఐఐటీలనుంచి..

దేశంలో ఉన్న మూడు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల కోసం ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం ప్రకటించింది. వీరిలో 300మందిని ఐఐటీలనుంచి నియమించుకుంటామని వెల్లడించింది.

ప్రతిభకు పెద్ద పీట వేస్తూ..

అలాగే ప్రతిభకు పెద్ద పీట వేస్తూ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, పిట్స్‌ పిలానీ, మణిపాల్‌ టెక్నాలజీ లనుంచి వీరిని ఎంపిక చేసుకుంటామని శాంసంగ్‌ గ్లోబల్‌​ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌,ఎండీ బెంగళూరు దీపేష్‌ షా వెల్లడించారు.

పరిశీలనలో మరింతమంది..

సాంప్రదాయికంగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులతో పాటు ఎలక్ట్రకిల్‌ ఇంజనీరింగ్‌, మాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, అప్లైడ్‌ మెషీన్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ లాంటి ఇతర కోర్సుల వారిని కూడా పరిశీలిస్తామని చెప్పింది.

టాప్ స్థానంలో..

కాగా శాంసంగ్‌కు బెంగళూరు, నోయిడా, ఢిల్లీలో ఆర్‌ అండ్‌ డి సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలకు కావాల్సిన టెక్నాలజీని కంపెనీ అందిపుచ్చకుంటుంది. కాగా ఇండియా మార్కెట్లో శాంసంగ్ టాప్ స్థానంలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung India to Hire 1000 Engineering Graduates for its R&D Facilities more news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot