Samsung ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కొనుగోలకు సువర్ణ అవకాశం!! 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌

|

శామ్సంగ్ బ్రాండ్ యొక్క గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనీ ప్రతి ఒక్కరు కూడా చుస్తూఉంటారు. అయితే వాటి యొక్క అధిక ధర కారణంగా వాటిని కొనుగోలు చేయాలని చూస్తూన్న వారికి ఇప్పుడు సంస్థ గొప్ప ఆఫర్ ని ప్రకటించింది. 24 నెలల చెల్లుబాటుతో నో కాస్ట్ EMI ఆఫర్‌ను శామ్సంగ్ సంస్థ ఇప్పుడు ప్రకటించింది. HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో గెలాక్సీ Z ఫోల్డ్3 5G, గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G అలాగే గెలాక్సీ S22 సిరీస్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారందరికీ కూడా ఈ సరికొత్త ఆఫర్ మొట్టమొదటిసారి అందుబాటులో ఉంది. భారతదేశంలోని శామ్సంగ్ బ్రాండ్ యొక్క రిటైల్ అవుట్‌లెట్‌లలో కూడా ఈ ఆఫర్ ని పొందవచ్చు.

 

24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌

24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ S22+ మరియు గెలాక్సీ S22 స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు నెలకు రూ.3042 ధర వద్ద నుండి ప్రారంభమయ్యే EMI చెల్లుబాటుతో పొందవచ్చు. అలాగే గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను రూ.4584 నో-కాస్ట్ EMI వద్ద కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే వినియోగదారులు శామ్సంగ్ బ్రాండ్ యొక్క ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా 24 నెలల నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్3 5G మరియు గెలాక్సీ ఫ్లిప్ 3 5Gలను ఈ ప్రత్యేక ఆఫర్లతో పొందవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు శామ్సంగ్ వినియోగదారులు ఇష్టపడే అన్ని రకాల ఫ్లాగ్‌షిప్ ఆవిష్కరణలతో నిర్మించిన ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు.

Galaxy
 

"Samsungలో మేము చేసే ప్రతి పనికి వినియోగదారులు కేంద్రంగా ఉంటారు. వారి జీవితాలను సులభతరం చేయడానికి మరో పెద్ద అడుగు వేస్తూ, మా ప్రీమియం Galaxy S22 సిరీస్, Galaxy Z Fold3 5G మరియు Galaxy Z Flip3 5Gపై HDFC బ్యాంక్‌తో మునుపెన్నడూ లేని 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌ను పరిచయం చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ ఆఫర్ మరింత మంది వినియోగదారులకు సామ్‌సంగ్ యొక్క సరికొత్త టెక్నాలజీలను అనుభవించడంలో సహాయపడుతుంది. శామ్సంగ్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మరియు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు గల డిమాండ్‌ను అన్‌లాక్ చేయడంలో ఈ కొత్త ఆఫర్ సహాయపడుతుంది" అని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ మరియు ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ ఒక ప్రకటనలో తెలిపారు.

గెలాక్సీ S22 అల్ట్రా

24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌తో గెలాక్సీ S22 అల్ట్రాని కొనుగోలు చేసే వినియోగదారులు గెలాక్సీ వాచ్4ని కేవలం రూ.2999 తగ్గింపు ధరకే పొందవచ్చు. అలాగే గెలాక్సీ S22+ లేదా గెలాక్సీ S22ని కొనుగోలు చేసే వారు గెలాక్సీ బడ్స్ ని రూ.2999 తగ్గింపు ధరకి పొందవచ్చు.

మార్కెట్ పల్స్ సర్వీస్

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ యొక్క మార్కెట్ పల్స్ సర్వీస్ ప్రకారం శామ్‌సంగ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 2022లో 9 శాతం వృద్ధి చెందాయి. దీని కారణంగా గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 24 శాతం ఆక్రమించాయి. ఏప్రిల్ 2017 నుండి శామ్‌సంగ్ సంస్థకి ఇదే అత్యధిక నెలవారీ మార్కెట్ వాటా. అదే సమయంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 8 శాతం క్షీణించినప్పటికీ కంపెనీ అమ్మకాలు పెరిగాయి. వాస్తవానికి మార్కెట్ క్షీణతకు వ్యతిరేకంగా వృద్ధి చెందిన కొన్ని బ్రాండ్లలో ఇది ఒకటి.

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్

2022లో వరుసగా మూడో నెలలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విక్రయాల్లో అగ్రగామిగా నిలిచేందుకు Samsungకు ఈ వృద్ధి దోహదపడింది. ఆగస్ట్ 2020 తర్వాత మొదటిసారిగా ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్‌లో నంబర్ 1 బ్రాండ్‌గా నిలిచింది. 2022 క్యూ2లో సామ్‌సంగ్ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మొదటి స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. త్వరలోనే శామ్‌సంగ్ బ్రాండ్ తన ఫోల్డబుల్ ఫోన్‌ల ధరలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S22 సిరీస్ ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ S22 సిరీస్ ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ S22 వనిల్లా బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 72,999 కాగా 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.76,999. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ S22+ యొక్క 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.84,999 మరియు 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 88,999. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ S22 Ultra, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 1,09,999 ధరకే ఉంది. భారతదేశంలో 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,18,999.

శామ్‌సంగ్ గెలాక్సీ S22 స్పెసిఫికేషన్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ S22 స్పెసిఫికేషన్‌లు

శ్యామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 పై వన్ UI 4.1తో రన్ అవుతుంది. ఇది 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది డైనమిక్ రిఫ్రెష్ రేట్ 1-120Hz మరియు గేమ్ మోడ్‌లో 240Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో పాటు 12GB వరకు RAMతో పనిచేస్తుంది. ఇది వెనుక భాగంలో అల్ట్రా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో పాటు f/1.8 లెన్స్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 3x ఆప్టికల్ జూమ్‌తో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ మరియు 10x ఆప్టికల్ జూమ్ మద్దతుతో మరో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 40-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

సామ్ సంగ్ గెలాక్సీ S22+ స్పెసిఫికేషన్స్

సామ్ సంగ్ గెలాక్సీ S22+ స్పెసిఫికేషన్స్

సామ్ సంగ్ గెలాక్సీ S22+ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది One UI 4.1తో ఆండ్రాయిడ్12లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ లైట్ కంట్రోల్ కోసం శామ్‌సంగ్ ఐ కంఫర్ట్ షీల్డ్‌కు మద్దతుతో 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 10Hzకి తగ్గే అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను మరియు 1,750 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. హుడ్ కింద గరిష్టంగా 12GB RAMతో జత చేయబడిన ఆక్టా-కోర్ 4nm SoCని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చబడి ఉంది. ఇందులో f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ వైడ్-యాంగిల్ సెన్సార్‌ను f/1.8 అపెర్చర్ లెన్స్‌తో కలిగి ఉంది; మరియు 3x ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు f/2.4 అపెర్చర్ లెన్స్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. Samsung Galaxy S22 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 80-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Introduces 24-Months No-Cost EMI Offer on Buying Galaxy S22 Series and Galaxy Z Fold3 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X