దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్ సంగ్, భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో సామ్ స్ంగ్ కు తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ లో ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, రిఫ్రీజరేటర్లు, టీవీలు తయారవుతున్నాయి. ఈ ప్లాంట్ ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్లను పెట్టబుడులుగా తీసుకువస్తున్నట్లు సామ్ సంగ్ తెలిపింది. నోయిడాలోని ప్లాంట్ ను అదనంగా 35 ఎకరాలకు విస్తరించటం వల్ల తయారీ సామర్థ్యం పెరగటంతో పాటు అదనంగా వేల మందికి ఉపాది లభిస్తుంది సామ్ సంగ్ తెలిపింది. ఈ పెట్టుబడులను రానున్న రెండేళ్ల కాలంలో ఖర్చు చేయనున్నట్లు సామ్ సంగ్ తెలిపింది. మేక్ ఇన్ ఇండియా విజన్ కు తాము కట్టుబడి ఉన్నామని, ఈ పెట్టుబడులే అందుకు నిదర్శనమని సామ్ సంగ్ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ HC Hong తెలిపారు. ప్రస్తుతానికి నెలకు 50 లక్షల స్మార్ట్ ఫోన్ యూనిట్లను తయారు చేయగలుగుతున్నామని, విస్తరణ పనులు పూర్తి అయి తయారీ సామర్థ్యం పెరిగినట్లయితే నెలలకు 100 లక్షల స్మార్ట్ ఫోన్ లను తయారు చేయగలుగుతామని సామ్ సంగ్ తెలిపింది. ఇదే సమయంలో టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల తయారీ కూడా మరింత పెరుగుతుందని సామ్ సంగ్ వెల్లడించింది. నోయిడా ప్లాంట్ ను సామ్ సంగ్ 1996లో ఏర్పాటు చేయగా, 1997 నుంచి టీవీల తయారీ మొదలైంది. 2005 నుంచి మొబైల్ ఫోన్ ల తయారీని ప్రారంభించారు. సామ్ సంగ్ కు నోయిడాలోనే కాకుండా తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులోనూ ఒక ప్లాంట్ ఉంది.