ఇండియాలో RS.3500 కోట్ల పెట్టుబడులను పెడుతున్న శామ్‌సంగ్
ఒకప్పుడు ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించిన వాటిలో నోకియా తరువాతి స్థానంలో శామ్‌సంగ్ ఉంది. ఇప్పుడు ఇండియాలో చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువగా అవుతోంది. శామ్‌సంగ్ ఇప్పుడు ఇండియాలో తన పూర్వవైభవాన్ని మళ్ళి కొసాగించడానికి ఇండియాలోనే శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్ప్లే లను ఉత్పత్తి చేయడానికి న్యూ డిల్లీ శివార్లలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనీ భావిస్తోంది. అందుకోసం సుమారు 500 మిలియన్ డాలర్లను ఇండియాలో పెట్టుబడిగా పెట్టబోతున్నది.

ఈ నెల ప్రారంభంలో కొత్త ఫ్యాక్టరీకి కావలసిన పెట్టుబడి మరియు దాని ప్రణాళిక యొక్క పూర్తి వివరాలను స్థానిక రెగ్యులేటర్‌కు దాఖలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రముఖ దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ యొక్క ఈ ప్లాంట్ లో స్మార్ట్‌ఫోన్‌ల డిస్ప్లే లతో పాటు విస్తృతంగా ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను కూడా ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త ప్లాంట్ కోసం నోయిడాలో ఉన్న తన ఫ్యాక్టరీ నుండి కొంత భూభాగాన్ని కేటాయించినట్లు కంపెనీ దాఖలు చేసింది.

2018 లో శామ్సంగ్ నోయిడాలో ఒక ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ ఫ్యాక్టరీగా పేరు గాంచింది. ఆ కర్మాగారం కోసం సంస్థ సుమారు 700 మిలియన్లను ఖర్చు చేసింది.

శామ్సంగ్ యొక్క కొత్త ప్లాంట్ స్థానికంగా స్మార్ట్‌ఫోన్ యొక్క విడిభాగాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటుగా న్యూ డిల్లీ అందించే అనేక పన్ను ప్రయోజనాలను పొందటానికి సహాయపడుతుంది.

షియోమి సంస్థ ఇండియాలో ప్రవేశించిన తరువాత శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగం కాస్త తగ్గింది అని కూడా చెప్పవచ్చు. మళ్ళి తన పూర్వ వైభవాన్ని పొందడానికి మరియు చైనా యొక్క అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ సంస్థలతో పోటీని ఎదుర్కొవడానికి కొత్త ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కంపెనీకి ఉపయోగపడతాయి.

శామ్సంగ్ ఇప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ప్లేయర్. దాదాపు 500 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ స్థానంలో శామ్‌సంగ్ ఉంది. గత నెల డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవలి నెలల్లో మార్కెట్ వాటాను స్వల్ప మొత్తంలో కోల్పోయింది.


Click it and Unblock the Notifications








