భారతీయులు మనసు దోచిన బ్రాండ్ ‘సామ్‌సంగ్’

Posted By:

భారతీయులు మనసు దోచిన బ్రాండ్ ‘సామ్‌సంగ్’

భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా సామ్‌సంగ్ నిలిచిందని ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014' వెల్లడించింది. సామ్ సంగ్ తరువాతి స్థానాలను సోనీ, టాటాలను సొంతం చేసకున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ ఈ నివేదికలను విడుదల చేస్తూ వస్తోంది. 2013లో ఈ మూడు బ్రాండ్‌లు 2,4,5స్థానలను దక్కించుకున్నాయి.

‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014' జాబితాలో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌కు 4వ స్థానం లభించింది. ఫిన్నిష్ మొబైల్ ఫోన్‌ల దిగ్గజం నోకియా 5వ స్థానంతో సరిపెట్టుకుంది. హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్‌పి) 6వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో భాగంగా 100 కంపెనీల ర్యాంకులను ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ పొందుపరిచింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2013, నాలుగవ త్రైమాసికంలో సామ్‌సంగ్ 86 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించి యాపిల్ పై భారీ ఆధిపత్యాన్ని సాధించింది. అయినప్పటికి ఈ త్రైమాసికంలో యాపిల్ తన అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకోగలిగింది. ప్రముఖ అంతర్జాతీర రీసెర్చ్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot