మార్కెట్ లోకి విడుదలకానున్న శ్యామ్‌సంగ్‌ గ్యాలక్సీ స్మార్ట్‌పోన్‌లు

Posted By: Staff

మార్కెట్ లోకి విడుదలకానున్న శ్యామ్‌సంగ్‌ గ్యాలక్సీ స్మార్ట్‌పోన్‌లు

హైదరాబాద్‌: మొబైల్‌ పోన్ల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు పొంది న శ్యామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తన గ్యాలక్సీ కుటుంబాన్ని పొడిగి స్తూ మరిన్ని నూతన రకాలను ప్రవేశపెట్టి నట్లు ప్రకటించింది. గ్యాలక్సీ ఎసీ, గ్యాలక్సీ ఫిట్‌, గ్యాలక్సీ పాప్‌ స్మార్ట్‌పోన్లను సంస్థ విడు దల చేసింది.

ఈ సందర్భంగా సంస్థ దేశీయ హెడ్‌ రంజిత్‌యాదవ్‌ మాట్లాడుతూ శ్యామ్‌సంగ్‌ విడుదల చేసిన అనేక మోడల్స్‌లలో ఎక్కువగా ఆధరణ పొంది నవి గ్యాలక్సీ రకాలని, అందుకే వినియోగదారులకు మరిన్ని ఆధు నిక సేవలు అందించాలనే లక్ష్యంతో గ్యాలక్సీ స్మార్ట్‌ పోన్ల ను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

ఇవి విని యోగదారులను విరివిగా ఆకర్షిస్తాయని అన్ని వయస్సుల వారి కి ,అన్ని రంగాల వారికి అందుబాటులో ఉండేలా వీటిని రూ పొందించినట్లు ఆయన తెలిపారు. ఈ నూతన రకాలలో ప్రిమి యం డిజైన్‌తో మల్టీమీడియా సౌకర్యం కూడా ఉందని వివరిం చారు. ఎన్నో ఆధునిక సౌకర్యాలు గల ఈ డిజైన్‌లను వినియో గదారులు ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot