శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్ రిలీజ్!

By: Madhavi Lagishetty

స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. థాయిలాండ్ లో గెలాక్సీ జె7 ప్లస్ స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేసింది. గెలాక్సీ జె7 ప్లస్ లేదా గెలాక్సీ జె7+గా డబ్ చేయబడింది. ఇది గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ ఫోన్ మాదిరిగానే రెండు డ్యుయల్ కెమెరాలతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్ రిలీజ్!

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్, గెలాక్సీ జె7(2017) గెలాక్సీ జె7 ప్రో వంటి మిడ్ రేంజ్ స్మార్ట్ పోన్లు బ్లాక్, గోల్డ్ మరియు పింక్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది THB 12,900(సుమారు రూ. 25,000) రూపాయలకు లభ్యం అవుతుంది.

థాయిలాండ్ లో స్మార్ట్ ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్ ఇప్పటికే ప్రారంభమైంది. గెలక్సీ జె7 ప్లస్ ముందస్తుగా ఆర్డర్ చేసిన వినియోగదారులకు శాంసంగ్ U ప్లెక్స్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ను అడిషన్ ల్ గా పొందుతారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్న విషయంపై స్పష్టత లేదు.

స్పెక్స్ విషయానికొస్తే...శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్ 5.5 అంగుళాల పూర్తి హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. దాని హుడ్ కింద ఒక మీడియా టెక్ హెలియో పి20 ప్రొసెసర్ తో పవర్ ను పొందుతుంది. ఈ చిప్సెట్ 4జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజితో ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డును 256జిబి వరకు స్టోరేజి స్పేస్ ను విస్తరించుకునే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ కు బ్యాక్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్ అనేది శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్ యొక్క మెయిన్ హైలేట్ అని చెప్పొచ్చు. F/1.7 ఎపర్చర్ తో 5మెగాపిక్సెల్ సెకండరీ సెన్సర్తో పాటు 13మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంది. ఒక ఇమేజ్ తీసినప్పుడు యూజర్లు బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయితే క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంది.

ఇండియాలో లాంచ్ అయిన షియోమి కొత్త ప్రొడక్ట్స్ ఇవే

వెర్టికల్లిగా అరెంజ్ చేసిన బ్యాక్ కెమెరా సెన్సార్లను LED ఫ్లాష్ తో యాడ్ చేయవచ్చు. ఫ్రంట్ సైడ్ LEDఫ్లాష్ లైట్ తో ఒఖ F/1.9 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జె7ప్లస్ ఆండ్రాయిడ్ నౌగట్ OSతో రన్ అవుతుంది. 3,000ఎంఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడుతుంది. అంతేకాదు ఫోన్ భద్రత కోసం ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను ఏర్పాటు చేశారు. త్వరలోనే గెలాక్సీ జె7ప్లస్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Read more about:
English summary
The Samsung Galaxy J7 Plus's rear dual camera setup is comprised of a 13MP and a 5MP sensor.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot