TUV SUDతో సామ్‌సంగ్ చారిత్రాత్మక ఒప్పందం
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాల టెస్టింగ్ నిమిత్తం జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ TUV SUDతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ అగ్రిమెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ అభివృద్ధి చేసే ఆటోమోటివ్ ఎల్ఈడి ప్రొడక్ట్స్ పనితీరును TUV SUD పరీక్షించి సర్టిఫికేషన్‌ను ఇవ్వనుంది. ఆటోమొబైల్ విడిభాగాల నాణ్యతను పరీక్షించటంలో 100 సంవత్సరాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్న TUV SUD కంపెనీ ఇన్స్‌పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ విభాగాల్లో నెంబర్ వన్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది.
ఓ ఆటోమోటివ్ ఎల్ఈడి కాంపోనెంట్ల తయారీదారు, టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రొవైడర్‌తో చేతులు కలపటం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని ఈ అగ్రిమెంట్ సందర్భంగా సామ్‌సంగ్ వెల్లడించింది. సాధారణంగా క్వాలిటీ చెకింగ్ ప్రాసెస్ అనేది ఇన్-హౌస్ టెస్టింగ్ ఛానల్ ద్వారా జరుగుతుంది.
ఈ ప్రోగ్రామ్ టెస్టింగ్ ప్రాసెస్‌లో భాగంగా సామ్‌సంగ్ అభివృద్ధి చేసే ఆటోమోటివ్ ఎల్ఈడి కాంపోనెంట్‌లను AEC-Q102 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పై TUV SUD పరీక్షిస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత సామ్‌సంగ్ నిర్వహించే పలు ఇన్-హౌస్ టెస్టింగ్‌లను ఈ ఎల్ఈడి కాంపోనెంట్లు ఎదుర్కోవల్సి ఉంటుంది. అంతిమంగా ఈ ప్రొడక్ట్స్ రెండు కంపెనీలకు సంబంధించిన సర్టిఫికేషన్స్‌తో మార్కెట్లోకి వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ కాంపోనెంట్ల పరిశ్రమకు ఈ చారిత్రాత్మక ఒప్పందం స్పూర్తిగా నిలవటంతో పాటు ప్రొడక్ట్ సేఫ్టీ ఇంకా క్వాలిటీ విభాగాలను మరో మెట్టు ముందుకు తీసుకువెళుతుందని ధీమా వ్యక్తం చేసారు.
సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎల్ఈడి క్వాలిటీ టీమ్ వైస్ ప్రెసిడెంట్ Sung-Kwan Lim మాట్లాడుతూ, తమ ప్రొడక్ట్ సామార్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో టీయూవీ ఎస్‌యూడితో కుదుర్చకున్న ఒప్పందాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నామని అన్నారు. TUV SUD ఆటోమోటివ్ ఎల్ఈడి కాంపోనెంట్‌లకు ఇచ్చే క్వాలిటీ, సేఫ్టీ ఇంకా రిలయబిలిటీ రేటింగ్స్ పై తమకు పూర్తి స్థాయిలో నమ్మకముందని ఆయన స్పష్టం చేసారు.
సామ్‌సంగ్ గురించి టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.
ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications








