5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం శామ్సంగ్ Exynos 1280 SoC చిప్‌సెట్!! ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో తెలుసా

|

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ సంస్థ కొత్తగా Exynos 1280 చిప్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇది కొత్త అప్ డేట్ తో సరికొత్త ఫీచర్లతో మెరుగుపరచబడిన 5G మరియు AI సామర్థ్యాలతో వస్తుంది. గెలాక్సీ A33, గెలాక్సీ A53 మరియు గెలాక్సీ M33తో సహా మరికొన్ని మిడ్-రేంజ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ చిప్‌సెట్‌ను ఇప్పటికే వినియోగించడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెసర్ 5G స్మార్ట్‌ఫోన్‌లకు సమర్థవంతమైన కంప్యూటింగ్ మరియు గ్రాఫిక్స్ పనితీరును తీసుకువస్తుందని సంస్థ పేర్కొంది. ఇందులో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Samsung Exynos 1280 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే : FHD+ @120 Hz

మెమరీ: LPDDR4x

ప్రాసెస్ టెక్నాలజీ : 5 nm EUV

CPU: టూ కార్టెక్స్-A78 @2.4Ghz + సిక్స్ కార్టెక్స్-A55 @2.0GHz, 64-బిట్

GPU: ఆర్మ్ మాలి-G68

AI ఇంజిన్: NPUతో AI ఇంజిన్, 4.3 టాప్స్

మోడెమ్: 5G NR సబ్-6GHz + 5G NR mmWave 1, 2.55 Gbps DL, 1.28 Gbps UL, గ్లోబల్ 5G మల్టీ-సిమ్

Wi-Fi: డ్యూయల్-బ్యాండ్ (2.4/5G)తో Wi-Fi 802.11ac MIMO

కెమెరా: 108 MP సింగిల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా 16 MP వరకు, 4K వీడియో @30fps రికార్డింగ్ మరియు ప్లేబ్యాక్

స్టోరేజ్: UFS v2.2

మరిన్ని ఇతర ఫీచర్స్ : బ్లూటూత్ 5.2, FM రేడియో Rx, L1 మరియు L5 GNSS కోసం క్వాడ్-కాన్స్టెలేషన్ మల్టీ-సిగ్నల్

 

Samsung Neo QLED 8K స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి!! ధరలు చాలా ఎక్కువ...  Samsung Neo QLED 8K స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి!! ధరలు చాలా ఎక్కువ...  

Samsung Exynos 1280 SoC ఫీచర్స్
 

Samsung Exynos 1280 SoC ఫీచర్స్

శామ్సంగ్ సంస్థ విడుదల చేసిన కొత్త చిప్‌సెట్ 5nm EUV టెక్నాలజీపై నిర్మించబడింది. ఇది 2.4Ghz వద్ద క్లాక్ చేయబడిన రెండు కార్టెక్స్-A78 కోర్లను మరియు 2.0GHz వద్ద క్లాక్ చేయబడిన ఆరు కార్టెక్స్-A55 పవర్-ఎఫిషియెంట్ కోర్‌లను కలిగి ఉన్న ఆక్టా-కోర్ CPUతో శక్తిని పొందుతుంది. GPU విషయానికొస్తే ఈ కొత్త చిప్‌సెట్ Arm Mali-G68 మరియు సబ్-6GHz మరియు mmWave 5G కనెక్టివిటీతో వస్తుంది. అదనంగా ఇది 108MP సింగిల్ కెమెరా మరియు 16MP ట్రిపుల్ కెమెరా సెటప్ లతో పాటుగా 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతును అందిస్తుంది. డిస్ప్లే విషయానికొస్తే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే FHD+ డిస్‌ప్లేకు మద్దతు ఇస్తుందని సంస్థ వెల్లడించింది.

అమెజాన్‌లో వివో బ్రాండ్ ఫోన్ల కొనుగోలుపై రూ.3000 వరకు తగ్గింపు ఆఫర్లు....అమెజాన్‌లో వివో బ్రాండ్ ఫోన్ల కొనుగోలుపై రూ.3000 వరకు తగ్గింపు ఆఫర్లు....

Exynos

శామ్‌సంగ్ ఫౌండరీ సంస్థ ఫ్యూజ్డ్ మల్టిప్లై-యాడ్ (FMA) టెక్నాలజీ సహాయంతో ఈ చిప్‌సెట్‌ను ఉత్పత్తి చేసి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొనివస్తున్నది. ఈ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన చిప్‌సెట్ విద్యుత్ వినియోగాన్ని మరియు బ్యాటరీ సామర్థ్యాన్ని రెండిటిని కూడా పెంచుతుంది. మల్టీ-ఫ్రేమ్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో శామ్సంగ్ Exynos 1280 SoC మెరుగైన వివరాలతో స్పష్టమైన ఫోటోలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ చిప్‌సెట్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)తో కూడా వస్తుంది. ఇది రియల్-టైమ్ మోషన్ అనాలసిస్ మరియు మల్టీ-ఆబ్జెక్ట్ సర్వైలెన్స్ వంటి AI ఫంక్షన్‌లను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Launched Exynos 1280 SoC New Chipset For 5G Mid Range Smartphones: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X