Home
News

చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ సంస్థ పిల్లల కోసం కొత్తగా శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A7 లైట్ కిడ్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. శామ్సంగ్ ఈ టాబ్లెట్ కోసం రష్యన్ పిల్లల బ్రాండ్ స్మేషారికితో జతకట్టింది. శామ్సంగ్ ప్రకారం ఈ డివైస్ Lego, Riki Group (Smeshariki బ్రాండ్), Toca వంటి ఇతర ప్రముఖ భాగస్వామి బ్రాండ్‌ల కంపెనీల కంటెంట్‌తో ప్రీఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇందులోని ఆకర్షణీయమైన అప్లికేషన్‌లు పిల్లలకు విశ్రాంతి సమయంలో విద్యాపరంగా నిర్వహించడంలో ఉపయోగకరమైనవిగా సహాయపడతాయి. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ ధరలు & ఫీచర్స్

శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ ధరలు & ఫీచర్స్

శామ్సంగ్ గ్యాలాక్సీ A కిడ్స్ లేదా శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ ఎడిషన్ టాబ్లెట్ రష్యాలో RUB 14,990 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.15,500 గా ఉంది. అయితే భారతీయ మార్కెట్‌లో ఈ ట్యాబ్‌ను విడుదల చేయడానికి సంబందించిన వివరాలను కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు.

శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ట్యాబ్‌ 8.7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ 1,340×800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 2.3GHz ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఆధారితంగా మరియు MediaTek Helio P22T ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 3 GB RAM మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు. ముఖ్యంగా ఇది బ్లూటూత్ v5.0 కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే WiFi-ఓన్లీ ట్యాబ్.

గ్యాలాక్సీ ట్యాబ్

శామ్సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ టాబ్లెట్ పిల్లల కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన UIతో వస్తుంది. అలాగే ఇది 20 కంటే ఎక్కువ విద్యాపరమైన గేమ్‌లు మరియు యాప్‌లను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ యొక్క మరొక గొప్ప ఫీచర్ ఏమిటంటే ఇది తల్లిదండ్రుల నియంత్రణలను అందజేస్తుంది. తల్లిదండ్రులు స్క్రీన్ సమయ పరిమితిని సెట్ చేయడానికి మరియు పిల్లలు యాక్సెస్ చేయగల కంటెంట్‌ను సెట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. అలాగే ఇది డిజిటల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది. ఇది అడిగినప్పుడు సంగీతం లేదా ఆటను ప్లే చేయగలదు. ట్యాబ్ రక్షణ కోసం మృదువైన, చంకీ రంగుల కవర్‌తో వస్తుంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే ఇది వెనుకవైపు 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు సెల్ఫీల కోసం 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. Galaxy Tab A Kids 5,100 mAh బ్యాటరీతో అమర్చబడింది మరియు 366 gm బరువు ఉంటుంది. బ్రియో వరల్డ్ గేమ్, పెట్సన్స్ ఇన్వెన్షన్స్, అనేక టోకా బోకా గేమ్‌లు, మూడు కికోరికి గేమ్‌లు మరియు మరిన్నింటితో సహా అనేక గేమ్‌లతో ట్యాబ్ వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Launched Galaxy Tab A Kids Tablet Exclusive For Kids: Price, Specs, India Launch Date and More.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X