Just In
Don't Miss
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్, ఇండియాకి ఎప్పుడు ?
ప్రపంచం 5జీ నెట్‌వర్క్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా 5జీ మొబైల్స్ తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ 5జీ సపోర్టెడ్ ఫోన్లను రిలీజ్ చేస్తూ వెళుతోంది.. గతంలో గెలాక్సీ నోట్ 10 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన శాంసంగ్ ఇప్పుడు కొరియాలో 5జీ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ90ని ఆవిష్కరించింది. సెప్టెంబర్ 4 నుంచి సౌత్ కొరియాలోశాంసంగ్ గెలాక్సీ ఏ90 సేల్ మొదలుకానుంది. దీని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ చిప్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
6/8జీబీ ర్యామ్, 64, 128 జీబీ జీబీ స్టోరేజ్
512 జీబీ వరకు విస్తరణ సామర్థ్యం
48+8+5 ఎంపీ రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
శాంసంగ్ డెక్స్ సపోర్ట్
సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్
5జీ సపోర్ట్
ఆండ్రాయిడ్ 9 పై + శాంసంగ్ వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్

అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కొరియన్ మార్కెట్లలో విక్రయానికి సిద్ధమైన ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇండియాలో 5జీ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఏ 90 4జీ వేరియంట్‌ను ఇండియాలో తీసుకొస్తుందా లేదా, వచ్చే ఏడాది దాకా వెయిట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ఇదిలా ఉంటే శాంసంగ్ మూడు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం21, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎం41 స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2020 కల్లా గెలాక్సీ ఫోన్లను విడుదల చేయనున్నారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఎం 41 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం21 ఫీచర్స్
4జీబీ ర్యామ్, శాంసంగ్ గెలాక్సీ ఎం21 స్నాప్‌డ్రాగన్ 9609 ఎస్‌వోసీ, వెనక వైపు రెండు కెమెరాలు, 24 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్.
శాంసంగ్ గెలాక్సీ ఎం31 ఫీచర్స్
6జీబీ ర్యామ్, వెనక వైపు ముడు కెమెరాలు, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం31 స్నాప్‌డ్రాగన్ 665 ఎస్‌వోసీ.
శాంసంగ్ గెలాక్సీ ఎం41 ఫీచర్స్
6జీబీ ర్యామ్, వెనక వైపు మూడు కెమెరాల సెటప్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్నాప్‌డ్రాగన్ 7904 ఎస్‌వోసీ ఉంటుంది.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500