Home
News

Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు 

శాంసంగ్ సంస్థ ఇండియా మార్కెట్లో తన తాజా QLED మరియు OLED సిరీస్ స్మార్ట్ టీవీలను AI ఫీచర్లతో NQ8 AI Gen3 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన కృత్రిమ మేధస్సు-మెరుగైన స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీలను బెంగళూరులోని శాంసంగ్ ఒపెరా హౌస్‌లో జరిగిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌బాక్స్ మరియు డిస్కవర్ 2024 ఈవెంట్‌లో ఈ AI ఆధారిత టీవీలను లాంచ్ చేయడం జరిగింది.

మెరుగైన Ai ఫీచర్లతో ఈ టీవీలలో నియో QLED 8K టీవీలు, నియో QLED 4K టీవీలు మరియు OLED TV లు ఉన్నాయి. Neo QLED 8K టీవీలు NQ8 AI Gen2 ప్రాసెసర్‌తో మరియు 4K రిజల్యూషన్ QLED టీవీలు NQ4 AI Gen2 ప్రాసెసర్‌తో వస్తాయని తెలుస్తోంది.

Samsung Launched New 8K And 4K Ai Powered Neo QLED SmartTvs

భారతదేశంలో ఈ Samsung AI టీవీల ధర
శాంసంగ్ భారతదేశంలో నియో QLED 8K మోడళ్లను విడుదల చేసింది, దీని ధరలు రూ. 3,19,990 నుండి ప్రారంభమవుతాయి. అలాగే, 4K మోడల్ టీవీలు రూ. 1,39,990 నుండి మరియు గ్లేర్-ఫ్రీ OLED టీవీలు రూ. 1,64,990 నుండి అందుబాటులో ఉంటాయి.

మీరు ఈ టీవీలను శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ నుండి మరియు అన్ని ప్రధాన రిటైలర్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలు ఏప్రిల్ 30 వరకు ప్రీ-ఆర్డర్ కోసం కూడా అందుబాటులో ఉన్నాయి.

Samsung AI 4K మరియు 8K టీవీల ఫీచర్లు
* Samsung QN800D నియో QLED 8K స్మార్ట్ టీవీలు - NQ8 AI Gen2 ప్రాసెసర్, 8K AI అప్‌స్కేలింగ్ క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ, ప్రోడాల్బీ అట్మోస్, మరియు శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి

* Samsung S90D OLED 4K స్మార్ట్ టీవీలు - NQ4 AI Gen2 ప్రాసెసర్, OLED HDR డాల్బీ అట్మాస్, పాన్ టోన్ ధృవీకరించబడిన కలర్ మరియు శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

* Samsung QN90D నియో QLED 4K స్మార్ట్ టీవీలు - NQ4 AI Gen2 ప్రాసెసర్, క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ, యాంటీ రిఫ్లెక్షన్, డాల్బీ అట్మోస్ మరియు శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

* Samsung QN85D నియో QLED 4K స్మార్ట్ టీవీలు - NQ4 AI Gen2 ప్రాసెసర్, క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ, 4K AI అప్‌స్కేలింగ్, డాల్బీ అట్మోస్ మరియు శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లు మరియు ధరలవివరాలు
ఈ నెల ఏప్రిల్ 30, 2024 వరకు ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లో భాగంగా, వినియోగదారులు కొనుగోలు చేసిన మోడల్‌పై ఆధారపడి సౌండ్‌బార్లు (రూ. 79,990), ఫ్రీస్టైల్ (రూ. 59,990), మ్యూజిక్ ఫ్రేమ్ (రూ. 29,990) వంటి కాంప్లిమెంటరీ ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు 20% వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

Best Mobiles in India

English summary
Samsung Launched New 8K And 4K Ai Powered Neo QLED SmartTvs In India. Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X