ఒకే ఒక కెమెరా తో Samsung కొత్త ఫోన్ ! అదీ, 50MP కెమెరా ...వివరాలు!

By Maheswara
|

Samsung సంస్థ తమ కొత్త Galaxy A23 5G జపాన్‌ మరియు కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో లాంచ్ చేశారు. మొదటగా ఆగస్టులో ముందుగా ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్‌లలో ఆవిష్కరించబడిన Galaxy A23 స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది. ఈ కొత్త Galaxy A సిరీస్ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌కు బదులుగా వెనుకవైపు ఒకే ఒక 50-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

 

Samsung Galaxy A23 5G

Samsung Galaxy A23 5G

ఇది ఆక్టా-కోర్ SoC ద్వారా పనిచేస్తుంది. మరియు ఇది 5.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. Samsung Galaxy A23 5G యొక్క ఈ కొత్త వేరియంట్ 4,000mAh బ్యాటరీ మద్దతు ఇస్తుంది మరియు మూడు రంగు ఎంపికలలో ఇది అందించబడుతుంది. జపాన్‌లో Samsung Galaxy A23 5G కోసం ఒకే ఒక RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మాత్రమే అందుబాటులో ఉంది.

Samsung Galaxy A23 5G ధర ఎంత?

Samsung Galaxy A23 5G ధర ఎంత?

Samsung Galaxy A23 5G యొక్క ఏకైక వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం జపాన్‌లో JPY 31,680 (దాదాపు రూ. 18,200) ధర నిర్ణయించబడింది. దీనిని au.com, J:Com, Rakuten మొబైల్ మరియు జపాన్‌లోని ఇతర రిటైలర్‌ల ద్వారా నలుపు, ఎరుపు మరియు తెలుపు రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతానికి, ఈ కొత్త Samsung Galaxy A23 5G వేరియంట్ యొక్క అంతర్జాతీయ మార్కెట్లో లభ్యతపై ఎటువంటి సమాచారం లేదు.

Samsung Galaxy A23 5G స్పెసిఫికేషన్లు
 

Samsung Galaxy A23 5G స్పెసిఫికేషన్లు

కొత్త Samsung Galaxy A23 5G వేరియంట్ Android 12 తో పనిచేస్తుంది. మరియుఇది 16 మిలియన్ రంగులతో 5.8-అంగుళాల HD+ (720x1,560 పిక్సెల్‌లు) TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి ముందు మోడల్ లో పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే ఉంది. ఈ కొత్త ఫోన్ 2.2GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు 4GB RAMతో పనిచేస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 700 SoC వస్తుంది.

ఒకే ఒక 50-మెగాపిక్సెల్ సెన్సార్

ఒకే ఒక 50-మెగాపిక్సెల్ సెన్సార్

ఫోటోలు మరియు వీడియోల కోసం, గెలాక్సీ A23 5G ఫోన్ కొత్త వేరియంట్ వెనుక భాగంలో f/1.8 లెన్స్‌తో ఒకే ఒక 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, f/2.0 లెన్స్‌తో ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీనికి ముందుగా లాంచ్ చేసిన మోడల్ లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండేది.

ఫీచర్లు

ఫీచర్లు

ఈ కొత్త Galaxy A23 5G మైక్రో SD కార్డ్ (1TB వరకు) ద్వారా విస్తరించదగిన స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది.అలాగే, 64GB అంతర్గత స్టోరేజీ ని తీసుకువస్తుంది. ఇది దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G/LTE, బ్లూటూత్ v5.2, NFC, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ లు ఉన్నాయి. ఇంకా, ఈ Samsung కొత్త వేరియంట్‌ ఫోన్లో 4,000mAh బ్యాటరీ వస్తుంది. కానీ ఇందులో, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ గురించి ఎక్కడా వివరాలు లేవు. దీని కొలతలు 150×71×9.0mm మరియు బరువు 168 గ్రాములు గా ఉంది.

ఇండియాలో

ఇండియాలో

ఇటీవల ఇండియాలో, Samsung Galaxy M సిరీస్‌లో కొత్త Galaxy M04 ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ సపోర్ట్ వెబ్‌సైట్ పేజీ ఇండియాలో లైవ్‌లో ఉన్నందున ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ స్పెక్స్ పై పలు రూమర్లు ఆన్ లైన్ లో కనిపించాయి. Samsung Galaxy M04 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Samsung Galaxy M04 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది అని తెలుస్తోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Launched New Galaxy A23 Smartphone With Only Single 50MP Camera Setup, More Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X