సామ్‌సంగ్ నుంచి 110 అంగుళాల అల్ట్రా హైడెఫినిషన్ టీవీ

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ 110 అంగుళాల అల్ట్రా హైడెఫినషన్ టెలివిజన్ సెట్‌ను సౌత్ కొరియన్ మార్కెట్లో విడుదల చేసింది. దక్షిణ కొరియా మార్కెట్లో ఈ ఒక్కొక్క టీవీని 1,50,000 డాలర్లకు విక్రయించనున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.91,50,000.

 ఆ టీవీ ధర 90 లక్షలట!

సాధారణ హైడెఫినిషన్ టెలివిజన్‌తో పోలిస్తే నాలుగు రెట్ల అధిక రిసల్యూషన్‌ను ఈ టీవీ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా బొమ్మలను మరింత స్పష్టతతో వీక్షించవచ్చని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ టీవీలను దక్షిణ కొరియా మార్కెట్లో అమ్మకానికి ఉంచారు.

శక్తివంతమైన వినోద సాధానల్లో ఒకటైన టెలివిజన్ ఇప్పుడు ప్రతి ఇంటికి తప్పనిసరైంది. కాలానుగుణంగా టెలివిజన్ వ్యవస్థలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు అనేక టీవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సీఆర్‌టీ (కాథోడ్ రే ట్యూబ్)లకు భిన్నంగా ఎల్‌సీడీ ఇంకా హైడెఫినిషన్ టీవీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇవి డైరెక్ట్ వ్యూ టీవీలతో పోలిస్తే నాజూకు తత్వాన్ని కలిగి తక్కువ స్థలాన్ని ఆక్రమించటమే కాకుండా మెరుగైన దృశ్య నాణ్యతను అందిస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot