Just In
- 4 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 5 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 22 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- News
సోనియాగాంధీ పావులు... ప్రియాంక అంగీకారం?? ఆ రాష్ట్రంపై పట్టుకు పడుతున్న అడుగులు
- Finance
5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- Lifestyle
ఆర్ద్ర నక్షత్రం అంటే ఏమిటి? ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటనేది పూర్తి సమాచారం ఇక్కడ ఉంది..
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
గేమింగ్ ఔత్సాహికులకు శుభవార్త!! Samsung బ్రాండ్ 2022 స్మార్ట్‌టీవీలలో గేమింగ్ హబ్ యాక్సెస్...
Samsung సంస్థ 2022 సంవత్సరంలో లాంచ్ చేసిన అన్ని రకాల స్మార్ట్టీవీలన్నింటిలో శామ్సంగ్ గేమింగ్ హబ్‌గా పిలువబడే దాని గేమింగ్ హబ్‌ను ఈరోజు శామ్సంగ్ సంస్థ ప్రారంభించింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2022లో ప్రకటించబడిన శామ్సంగ్ గేమింగ్ హబ్ గేమింగ్ ఔత్సాహికులకు Xbox, Nvidia GeForce NOW, Google Stadia, Twitch మరియు Utomik వంటి వివిధ గేమ్ స్ట్రీమింగ్ సర్వీస్‌లను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో యాక్సెస్ చేయడానికి అవకాశంను అందిస్తుంది. ఈ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో అమెజాన్ లూనాకు కూడా సపోర్ట్ చేస్తుందని శాంసంగ్ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ సంస్థ అందించే ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌తో గేమింగ్ ఔత్సాహికుల ప్లేయర్లు ప్రత్యేక గేమింగ్ కన్సోల్‌ను కొనుగోలు చేయనవసరం లేకుండా గేమ్ లను ఆడేందుకు తమ వద్ద గల బ్లూటూత్ హెడ్సెట్లు మరియు కంట్రోలర్లు వంటి ఉపకరణాలను ఉపయోగించవచ్చు. అయితే ఇందులో గల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులు ఎటువంటి అదనపు గేర్లను కొనుగోలు చేయకుండానే శామ్సంగ్ స్మార్ట్ టీవీలు మరియు మానిటర్ల ద్వారా స్ట్రీమింగ్ గేమ్‌లను ఆస్వాదించవచ్చు. మరోక మాటలో చెప్పాలంటే వినియోగదారులు శామ్సంగ్ స్మార్ట్ టీవీలలో ఒకేసారి గేమింగ్ కంటెంట్ ను మరియు స్ట్రీమింగ్ అనుభవాలను ఆస్వాదించగలరు అని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో విజువల్ డిస్ప్లే బిజినెస్ యొక్క GEM PM హీజ్ చుంగ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.

శామ్సంగ్ బ్రాండ్ యొక్క గేమింగ్ హబ్ లో గేమింగ్ స్ట్రీమింగ్ సేవలతో పాటు యూట్యూబ్ మరియు Spotify వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను కూడా కలిగి ఉంది. ఇది వినియోగదారులు తమకు ఇష్టమైన సంగీతం మరియు పాడ్‌క్యాస్ట్‌లను ప్లే చేయడానికి మరియు ఈ ప్లాట్‌ఫారమ్ నుండి ట్రైలర్లను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ మిక్స్‌లో ముఖ్యమైన జోడింపులో Xbox TV యాప్ కూడా ఉంది. ఇది ఇతర కంపెనీల స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉన్న Xbox TV యాప్ లాగా కాకుండా ఇందులో Nvidia GeForce NOW, Google Stadia మరియు Twitch వంటి కలయికతో లభిస్తుంది. శామ్సంగ్ స్మార్ట్ టీవీలను కలిగి ఉన్న వారికి శామ్సంగ్ యొక్క గేమింగ్ హబ్ అనేది ప్రత్యేకంగా చేస్తుంది.

శామ్సంగ్ గేమింగ్ హబ్ లభ్యత
శామ్సంగ్ గేమింగ్ హబ్ యొక్క లభ్యత విషయానికి వస్తే ఇది 2022 సంవత్సరంలో విడుదలైన శామ్సంగ్ బ్రాండ్ స్మార్ట్ టీవీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ జాబితాలో 2022 Neo QLED 8K, Neo QLED 4K, QLEDలు మరియు 2022 స్మార్ట్ మానిటర్ సిరీస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ప్లాట్‌ఫారమ్ US, కెనడా, UK, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కొరియా మరియు బ్రెజిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే భారతదేశంలోని వినియోగదారులు తమకు నచ్చిన గేమ్‌లను ప్రసారం చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించలేరు. భారతదేశంతో సహా ఇతర దేశాలలో గేమింగ్ హబ్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై శామ్సంగ్ సంస్థ ఇంకా ఎటువంటి సమాచారంను విడుదల చేయలేదు. కానీ త్వరలోనే తీసుకొనిరానున్నట్లు ప్రకటించింది.

శామ్సంగ్ సంస్థ యొక్క గేమింగ్ హబ్ పేజీలో తరచుగా అడిగే ప్రశ్నల విభాగంలో శామ్సంగ్ గేమింగ్ హబ్ గురించి కొంత మంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా "గేమింగ్ యొక్క సులభమైన యాక్సెస్ కోసం ఈ సంవత్సరం తర్వాత మీ 2022 శామ్సంగ్ బ్రాండ్ స్మార్ట్ టీవీలలో గేమింగ్ హబ్ విలీనం చేయబడుతుంది" అని చెప్పింది. దీనర్థం ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలలో అనుదుబాటులోకి రానున్నది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086