శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌టీవీలు, రూ.24,900 నుంచే ప్రారంభం
దేశీయ స్మార్ట్‌టీవీ రంగంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలోకి మళ్లీ సరికొత్త టీవీలతో అడుగుపెడుతోంది. ఒకేసారి 8 స్మార్ట్‌టీవీలను లాంచ్ చేయనుంది. వీటి ధరలు రూ 24,900 నుంచి మొదలుకుని
దేశీయ స్మార్ట్‌టీవీ రంగంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలోకి మళ్లీ సరికొత్త టీవీలతో అడుగుపెడుతోంది. ఒకేసారి 8 స్మార్ట్‌టీవీలను లాంచ్ చేయనుంది. వీటి ధరలు రూ 24,900 నుంచి మొదలుకుని రూ.15 లక్షల వరకు ఉండనున్నాయి. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌టీవీలను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది
.

కాగా వీటి సైజు విషయానికి వస్తే 32 ఇంచ్ నుంచి మొదలుకుని 82 ఇంచ్ వరకు ఉండనున్నాయి. దేశీయ స్మార్ట్‌టీవీ రంగం అన్ని కంపెనీలకు ఇప్పుడు భారీ అమ్మకాలను తెచ్చిపెడుతుండటంతో దిగ్గజాల చూపు ఇప్పుడు ఇటువైపు పడింది.

దిగ్గజాలకు పోటీ
దేశీయ స్మార్ట్‌టీవీ రంగంలో ఇప్పుడు నువ్వా నేనా అంటూ వార్ కొనసాగుతుంది. VU, Xiaomi, TCL అలాగే ఇతర కంపెనీలు అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. చైనా దిగ్గజం షియోమి అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీలను తీసుకువస్తూ ఇండియా టీవీ మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసరత్తులు చేస్తోంది.

శాంసంగ్ ఎత్తులు
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శాంసంగ్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. personal computer, music system, home cloud, live cast and two-way sharing వంటి బెనిఫిట్లతో ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది.

మోడల్స్ ఎలా ఉండబోతున్నాయి
శాంసంగ్ నుంచి రానున్న సరికొత్త 32 ఇంచ్, 82 ఇంచ్ స్మార్ట్‌టీవీల్లో 4కె పానల్ అన్ బోర్డ్ ఉండనుంది.యూజర్లు ఈ స్మార్ట్ టీవీని అవసరమైన సమయాల్లో కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ వర్క్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకోవచ్చు.ఇంకా అవసరమనుకుంటే టీవీ డిస్ ప్లే ని ల్యాప్ టాప్ స్క్రీన్ గా మార్చుకోవచ్చు. టీవీని ఉపయోగించి మీరు పీసీ వర్క్ చేసుకోవచ్చు.

వర్చువల్ మ్యూజిక్ సిస్టం
రానున్నఈ టీవీని వర్చువల్ మ్యూజిక్ సిస్టంగా కన్వర్ట్ చేసుకోవచ్చని శాంసంగ్ క్లెయిమ్ చేసింది. వివిధర రకాల రంగుల్లో సాంగ్స్ ని విజువల్స్ స్పిన్ చేసుకోవచ్చని శాంసంగ్ తెలిపింది. దీంతో పాటు ఎక్సటర్నల్ స్పీకర్ ద్వారా ఆడియో విజువల్ అనుభూతిని పొందవచ్చు.

లైవ్ కాస్ట్ ఫీచర్
టీవీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చిన తరువాత రిమోట్ సాయంలో లైవ్ టీవీ ఆప్సన్ పొందవచ్చు. ఇందుకోసం శాంసంగ్ ప్రత్యేకంగా Live Cast featureని యాడ్ చేసింది. అలాగే Samsung Smart Hub,Two Way sharing వంటి అదనపు ఫీచర్లను కూడా జోడించింది. టీవీ యాప్స్ అలాగే లైవ్ టీవీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయిని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








