Home
News

త్వరలో విడుదల కానున్న Samsung గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ ప్రస్తుతం అనేక కొత్త ఫోన్‌ల తయారీపై పనిచేస్తోందని సమాచారం. త్వరలో శాంసంగ్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ Samsung Galaxy M34 5G విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ M34 5G ఫోన్‌ గత సంవత్సరం విడుదలైన గెలాక్సీ M33 5Gకి కొనసాగింపు వెర్షన్‌గా తెలుస్తోంది.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్డ్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో M34 కనిపించడంతో.. ఈ ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైందని తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ M34 5G సపోర్టు పేజీ ఆధారంగా ఈ ఫోన్‌ SM-M346B/DS మోడల్‌ నంబర్‌ను కలిగి ఉంది. అంటే ఈ ఫోన్‌ 5G సామర్థ్యంతోపాటు డ్యూయర్‌ సిమ్‌ను కూడా సపోర్టు చేయనుందని తెలుస్తోంది.

samsung-m34-5g-smartphone

త్వరలో లాంచ్‌ కానున్న శాంసంగ్‌ M34 5G ఫోన్ రూ.20,000 సెగ్మెంట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం విడుదలైన M33 5G ఫోన్ 6GB ర్యామ్‌, 128GB అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర రూ.15,999కు అందుబాటులోకి వచ్చింది. అయితే గెలాక్సీ M34 స్మార్ట్‌ఫోన్‌ ధర దీని కంటే కొంచెం అధికంగానే ఉండే అవకాశం ఉంది.

అయితే శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌కు గురించి స్పష్టమైన సమాచారం తెలియకపోయినా.. గెలాక్సీ A34 5G తరహా ఫీచర్లు కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. మరియు వాటర్‌డ్రాప్‌ నాచ్‌ను కలిగి ఉంటుంది.

గెలాక్సీ A34 5G ఫోన్‌ వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టేబిలైజేషన్‌తో కూడిన 48MP ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌ మరియు 5MP మ్యాక్రో సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు ముందువైపు 13MP సెల్ఫీ కెమెరా ఉంది.

A34 5G ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 13తో వన్‌ UI 5 ఆధారంగా పనిచేయనుంది. మరియు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వచ్చింది.

శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో సరైన వివరాలు తెలియనున్నాయి. జులైలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. కానీ దీనిపై శాంసంగ్‌ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు. శాంసంగ్‌ తన ఫోల్డబుల్‌ ఫోన్‌లు గెలాక్సీ Z Flip 5 మరియు గెలాక్సీ Z Fold 5 ఫోన్లను జులైలో లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung M34 5G smartphone may launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X