Samsung కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. సరికొత్త టెక్నాలజీతో 200MP కెమెరా?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) త్వరలో విడుదల చేయనున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెన్సార్‌ను పరిచయం చేసింది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫోన్ ఈ సంవత్సరం విడుదల అయిన శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా తదుపరి తరం ఫోన్‌గా రానుంది.
త్వరలో లాంచ్ కానున్న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S24 Ultra) 200MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా పనితీరుకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త కెమెరా సెన్సార్ 4k జూమ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజ్‌ను మరింత మెరుగుపరుస్తుందని తెలిపింది.

శాంసంగ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో ISOCELL జూమ్ ఎనీప్లేస్ టెక్నాలజీ పనితీరును వివరించింది. ఇటీవల ఆవిష్కరించిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌లోని క్వాల్‌కాం AI ఇంజిన్‌తోపాటు 200MP కెమెరా సెన్సార్.. ఆటోమేటిక్ సబ్జెక్ట్ ట్రాకింగ్‌కు మద్దతు అందిస్తుందని తెలిపింది. దీంతోపాటు 4kలో రికార్డు చేసిన వీడియోను నాలుగురెట్లు జూమ్ చేసేందుకు టెట్రా పిక్సల్ టెక్నాలజీ సపోర్టు చేస్తుందని పేర్కొంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 200MP కెమెరా సెన్సార్ డ్యూయల్ రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలిపింది. ఐసోసెల్ జూమ్ ఎనీప్లేస్ టెక్నాలజీ.. ఒకేసారి రెండు 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.
వీడియో రికార్డు చేసిన తర్వాత కూడా ఫ్రేమ్‌ను మార్చుకొనే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
వేగం మరియు మరింత నాణ్యమైన ఫొటోల కోసం ఎండ్ టూ ఎండ్ AI రిమోసియాక్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం ఉన్న ISOCELL HP3 ఫీచర్ కంటే ఈ కొత్త టెక్నాలజీ రెండు రెట్లు వేగంగా ఫొటోలను తీయగలదని శాంసంగ్ చెబుతోంది.
అయితే ఈ 200MP కెమెరా సెన్సార్ ఏ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుందో శాంసంగ్ వెల్లడించలేదు. అయితే 2024లో విడుదల కానున్న శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S24 అల్ట్రా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ మాత్రమే శాంసంగ్ ఇటీవల ప్రకటించిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ఫోన్ కలిగి ఉంటుంది. అయితే త్వరలో ఈ హ్యాండ్‌సెట్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S24 అల్ట్రా ఎప్పుడు విడుదల అవుతుందో శాంసంగ్ అధికారిక ప్రకటన చేయలేదు. 2024 తొలిభాగంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, డిజైన్, ఫీచర్ల వివరాలు త్వరలో బయటకువచ్చే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








