ఆపిల్ కోసం శాంసంగ్ పనిచేయనుందా.. రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందా..?
ఆపిల్ సంస్థ ఇటీవల నిర్వహించిన (Let Loose) ఈవెంట్ లో ఐప్యాడ్ ఎయిర్ 2024, ఐప్యాడ్ ప్రో M4 OLED లను విడుదల చేసింది. అయితే ఆపిల్ సంస్థ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ ల (Apple Foldable Devices) తయారీపై దృష్టిపెట్టినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే మరో వార్త తాజాగా వైరల్ అవుతోంది.
అధికారిక ప్రకటన చేయని సంస్థలు :
ఆపిల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం శాంసంగ్ డిస్‌ప్లేలను సరఫరా చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. Digitimes Asia నివేదిక ప్రకారం ఫోల్డబుల్ డివైజ్‌ల తయారీ కోసం ఆపిల్ మరియు శాంసంగ్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రెండు సంస్థలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

శాంసంగ్ డిస్‌ప్లే విభాగం సిద్ధమైందా?
అయితే ఆపిల్ కోసం శాంసంగ్ ఏ రకమైన ఫోల్డబుల్ డిస్‌ప్లే పైన పనిచేస్తుందో ఈ నివేదిక వెల్లడించలేదు. ఆపిల్ తొలి ఫోల్డబుల్ డివైజ్.. ఫోల్డబుల్ ఐఫోన్ లేదా పెద్ద ట్యాబ్లెట్‌గా రానుందని తెలుస్తోంది గతంలో వచ్చిన మరో నివేదిక ఆధారంగా ఆపిల్ డిమాండ్ల ఆధారంగా సరఫరా చేసేందుకు శాంసంగ్ డిస్‌ప్లే విభాగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ సెగ్మెంట్ పై శాంసంగ్ భారీ పెట్టుబడులు :
ఎన్నో సంవత్సరాలుగా శాంసంగ్.. ఫోల్డబుల్ డిస్‌ప్లే లను అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు ఫోల్డబుల్ డిస్‌ప్లేల పరిశోధన మరియు అభివృద్ధి పైన భారీ పెట్టుబడులు పెట్టింది. మరియు గత కొన్ని సంవత్సరాలుగా శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ వ్యాపారం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది.
ఆపిల్‌తో ఒప్పందంతో మరింత వృద్ధి..!
అయితే వీటితోపాటు ఫోల్డబుల్ వ్యాపారాన్ని మరింత ఆదాయం ఆర్జించే మార్గంగా భావిస్తున్నట్లు సమాచారం. ఫోల్డబుల్ డిస్‌ప్లే లకు ఆపిల్ ప్రధాన క్లైయింట్ గా ఉండడం ఈ విభాగం మరింత వృద్ధి చెందుతుందని మరియు ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఉత్పత్తులపైనా ఆపిల్ దృష్టి :
ఆపిల్ ఫోల్డబుల్ డివైజ్ లపై పనిచేస్తోందని గతంలో లీక్‌లు వచ్చాయి. అయితే ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ను 2026 లో ఆవిష్కరించే అవకాశం ఉంది. అదే సంవత్సరం లేదా తర్వాత ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు 20.3 అంగుళాల మ్యాక్ బుక్ లేదా ఐప్యాడ్ పైన పనిచేస్తోందని తెలుస్తోంది.
ఈ కొత్త మ్యాక్ బుక్ లేదా ఐప్యాడ్ ను 2025 సంవత్సరం నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 లేదా 27 సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చే అంగుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం పై ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
ఆపిల్, శాంసంగ్ మధ్యన గట్టి పోటీ ?
అయితే ఫోల్డబుల్ సెగ్మెంట్ లోకి ఆపిల్ ప్రవేశిస్తే.. శాంసంగ్ కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే శాంసంగ్ అనేక ఫ్లిప్, ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీంతోపాటు వన్‌ప్లస్, ఒప్పో, వివో, షియోమీ వంటి సంస్థలు కూడా ఈ తరహా డివైజ్‌లను తయారు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








