సీఈఎస్ వేదిక పై సామ్‌సంగ్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే

Posted By: Prashanth

సీఈఎస్ వేదిక పై సామ్‌సంగ్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే

 

సీఈఎస్ 2013, గాడ్జెట ఎగ్జిబిషన్‌లో అందరి దృష్టిని అలరించిన సామ్‌సంగ్ ఆధునిక స్టైల్‌కు అద్దం పడుతూ సరికొత్త స్మార్ట్ టీవీలతో పాటు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీలను ప్రదర్శించింది. ఇదే వేదిక పై మైక్రోసాఫ్ట్‌తో జతకట్టిన సామ్‌సంగ్ సరికొత్త ‘వైవోయూఎమ్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ’ని ప్రపంచానికి పరిచయం చేసింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ సరికొత్త డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను మొదటిగా అందుబాటులోకి తేనుంది. ఈ డిస్‌ప్లే వొంపులు తిరిగి ఉండటం విశేషం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నికల్ అధికారి ఎరిక్ రడ్డర్ స్పందిస్తూ తమ ఈ వినూత్న ఆవిష్కరణ డెవలపింగ్ స్థాయిలో ఉందని మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మరోవైపు సామ్‌సంగ్ సరికొత్ 8-కోర్ ఎక్సినోస్ ‘ఓక్టా’ చిప్‌ను ప్రకటించింది. ఈ చిప్‌ను కార్టెక్స్ ఏ15 నిర్మాణం ఆధారంగా వృద్ధి చేసినట్లు తెలిపారు. సామ్ సంగ్ సరికొత్త ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే టెక్నాలజీకి సంబంధించిన చిత్రాలను క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ces-samsung-flexible-screen

ces-samsung-flexible-screen

samsung-youm-2

samsung-youm-2

youm-3

youm-3

samsung_youm_-4

samsung_youm_-4

samsung-youm-flex-5

samsung-youm-flex-5

youm-6

youm-6
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot