Samsung నుంచి 'Music Frame' స్పీకర్లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
శాంసంగ్ సంస్థ బెంగళూరులో జరిగిన శాంసంగ్ అన్‌బాక్స్ మరియు డిస్కవర్ ఈవెంట్‌లో ఫోటో ఫ్రేమ్ మరియు స్పీకర్ గా వాడటానికి వీలుగా ఉండే కొత్త స్పీకర్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మ్యూజిక్ ఫ్రేమ్‌గా పిలువబడే పరికరంను స్వతంత్ర స్పీకర్‌గా లేదా Samsung టీవీ తో కలిపి ఉపయోగించుకోవచ్చు.
బెంగళూరులో జరిగిన శాంసంగ్ అన్‌బాక్స్ మరియు డిస్కవర్ ఈవెంట్‌లో ఈ కొత్త స్పీకర్ ను లాంచ్ చేసారు. ఈ మ్యూజిక్ ఫ్రేమ్ ధర రూ. 29,990 గా ఉంది. అయితే ఈ పరికరం యొక్క ఖచ్చితమైన లభ్యతను శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు. అయితే, సంస్థ యొక్క Neo QLED 4K/8K మరియు OLED 4K స్మార్ట్ టీవీలను ప్రీ-ఆర్డర్ చేసే వారు ఈ మ్యూజిక్ ఫ్రేమ్‌ను కాంప్లిమెంటరీ యూనిట్‌గా ఉచితంగా పొందవచ్చు.

ఈ సంవత్సరం ప్రారంభంలో లాస్ వెగాస్‌లో జరిగిన వార్షిక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ మ్యూజిక్ ఫ్రేమ్ మొదటిసారిగా పరిచయం చేసారు. ఈ పరికరం డిజిటల్ ఆర్ట్ మరియు చిత్రాలను ప్రదర్శించగల స్క్రీన్‌తో కూడిన స్పీకర్ మరియు స్టీరియో ప్రభావాన్ని సృష్టించడానికి బహుళ మ్యూజిక్ ఫ్రేమ్ పరికరాలను జతచేయవచ్చు.
ఈ స్పీకర్ లు దాని స్వంత రిమోట్ కంట్రోల్‌తో రానప్పటికీ, Samsung TV వినియోగదారులు మ్యూజిక్ ఫ్రేమ్‌ను నియంత్రించడానికి అదే TV రిమోట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
ఇది గది అంతటా ధ్వనిని వ్యాప్తి చేయడానికి మూడు స్పీకర్లు మరియు వేవ్‌గైడ్‌ను కలిగి ఉంది. అదనంగా, Q-సింఫనీ టెక్నాలజీ ని కూడా కలిగి ఉంటుంది. ఈ స్పీకర్‌ను ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ టీవీలతో జత చేయడం ద్వారా రెండు పరికరాల్లో ఆడియోను ఒకే సమయంలో ప్లే చేయడం ద్వారా మ్యూట్ చేయకుండా చేయవచ్చు.
ఆప్టిమైజ్ చేయబడిన ఆడియో నాణ్యతను అందించడానికి ఈ స్పీకర్ SpaceFit Sound Pro టెక్నాలజీ ని ఉపయోగించి పరిసరాలను స్కాన్ చేయవచ్చు మరియు కొలవవచ్చు.
ఈ చిన్న పరికరం ఆరు స్పీకర్లతో అమర్చబడింది మరియు Atmos Music, Atmos మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ వంటి టెక్నాలజీ లకు అనుకూలంగా ఉంటుంది. ఇది 120W వరకు ధ్వనిని ఉత్పత్తి చేయగలదు. బ్లూటూత్ లేదా Wi-Fiని ఉపయోగించి మ్యూజిక్ ఫ్రేమ్‌ను స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయవచ్చు.
ఇది ఆప్టికల్-ఇన్ కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తుంది. ఈ స్పీకర్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో కూడా పనిచేస్తుంది. ఇంకా, Apple AirPlay కి సపోర్ట్ చేస్తుంది.ఈ మ్యూజిక్ ఫ్రేమ్ స్మార్ట్‌థింగ్స్ USB డాంగిల్‌తో స్మార్ట్‌థింగ్స్ కు హబ్‌గా కూడా పని చేస్తుంది. ఇది వివిధ శామ్‌సంగ్ స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








