Home
News

శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్ 4 ఫీచర్స్ లీక్ అయ్యాయి!!

శామ్‌సంగ్ సంస్థ ఆగస్టు 11 న నిర్వహిస్తున్న తన యొక్క తదుపరి అన్‌ప్యాక్ ఈవెంట్‌లో అనేక రకాల ఉత్పత్తులను విడుదల చేయాలని ఇప్పటికే సూచించబడింది. ఇందులో ముఖ్యమైనవి కంపెనీ యొక్క ఫోల్డబుల్స్ తాజా వెర్షన్‌లు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మరియు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 లతో పాటుగా స్మార్ట్ వాచ్‌లు వంటి ఇతర యాక్ససరీలను కూడా విడుదల చేయనున్నది.

అన్ ప్యాక్ఎడ్ ఈవెంట్

తదుపరి అన్ ప్యాక్ఎడ్ ఈవెంట్ కోసం కేవలం ఒక వారం మాత్రం ఉన్నాము. ఇప్పటికే వీటికి సంబందించిన లీక్‌లు పెరగడం ప్రారంభమవుతున్నాయి. ఈ అన్‌ప్యాక్ చేయబడిన ఈవెంట్‌లో మనం చూడగలిగే అలాంటి రెండు ఉత్పత్తులపై చాలా లీక్ లు అందించాయి. అయితే శామ్‌సంగ్ మరియు గూగుల్ రెండు కలిసి నిర్మిస్తున్న కొత్త స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ యొక్క OS మరియు ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ స్మార్ట్‌వాచ్

శామ్‌సంగ్ సంస్థ యొక్క కొత్త స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ కు సంబందించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే అన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ఈ కొత్త స్మార్ట్ వాచీల యొక్క వివరాలలోకి వస్తే లీక్ ల ప్రకారం ఇది బ్లాక్ మరియు సిల్వర్ కలర్ లలో గుండ్రని బెజెల్‌ నిర్మాణంను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ మరియు జూలై నెలలో ఇవాన్ బ్లాస్ ద్వారా పోస్ట్ చేయబడిన వివరణాత్మక GIF ల ద్వారా బహిర్గతమైన రెండర్‌ల మాదిరిగానే ఉంటుంది.

శామ్‌సంగ్ & గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ OS

శామ్‌సంగ్ & గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ OS

ఇందులో మరింత ముఖ్యమైనది ఏమిటంటే గూగుల్ సంస్థ శామ్‌సంగ్‌తో కలిసి పనిచేస్తు కొత్త స్మార్ట్‌వాచ్ లో తన యొక్క OS ను చేర్చడం. ప్రస్తుతం వాస్తవ పరికరాల్లో ఇది కొద్దిగా బిన్నంగా ఉంది. అయితే ప్రస్తుత లీక్‌లలో దీనికి సంబంధించి సమాచారం మనం ఎక్కువగా చూడలేము. ఎందుకంటే ఇది సెటప్ స్క్రీన్‌ను చూపిస్తుంది మరియు సమయాన్ని సెట్ చేయమని వినియోగదారుని ప్రాంప్ట్ చేస్తుంది.

గూగుల్

గూగుల్ మరియు శామ్‌సంగ్ మే నెలలో గూగుల్ I/O లో Wear OS మరియు Tizen లను విలీనం చేస్తామని ప్రకటించాయి. అలాగే బ్యాటరీ లైఫ్ ను కూడా మెరుగుపరిచే వాగ్దానం చేసాయి. వేగవంతమైన యాప్ లోడింగ్ సమయాలు మరియు అనేక ఇతర మెరుగుదలలు కూడా అదనంగా ఉన్నాయి. శామ్‌సంగ్ తన స్మార్ట్‌వాచ్‌లలో కొత్త OS ఎలా ఉంటుందో పరిశీలించిన తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది. ఆ సమయంలో ఇది మరింత మనోహరంగా ఉంటుంది. ఆగష్టు 11 అన్‌ప్యాక్ ఈవెంట్ లో శామ్సంగ్ తన కొత్త ఫోల్డబుల్స్ టీజ్ చేస్తున్నప్పుడు కంపెనీ తన అన్‌ప్యాక్ ఈవెంట్లలో స్మార్ట్ వాచ్లను కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రదర్శించిన చరిత్రను కలిగి ఉంది. కాబట్టి ఈవెంట్ సమయంలో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యే బలమైన అవకాశం ఉండవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung New Smartwatch Galaxy Watch 4 Classic OS Features Leaked: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X