నా ఫోన్‌ను ఏం చేయమంటారు..?, సామ్‌సంగ్‌కు అమితాబ్ సూటి ప్రశ్న!

తన గెలాక్సీ నోట్ 7 ఛార్జింగ్ సమస్యకు సంబంధించి భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ సామ్‌సం‌గ్‌ను నిలదీసారు. 'నా వద్ద సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 ఉంది.మీరు నా ఫోన్‌ ఛార్జింగ్‌ను 60 శాతానికి కుదించారు, దాన్ని ఎప్పుడు 100 శాతం చేస్తారు. మిస్టర్ సామ్‌సంగ్ ప్లీజ్ రెస్పాండ్! జర జల్దీ! అంటూ అమితాబ్ ట్వీట్ చేసారు.

నా ఫోన్‌ను ఏం చేయమంటారు..?, సామ్‌సంగ్‌కు అమితాబ్ సూటి ప్రశ్న!

Read More : 'రేపటి వరకు ఆగండి, అసలు డీల్స్ మొదలవుతాయ్', అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ పంచ్!

సెప్టంబర్ 15 తరువాత కొనుగోలు చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లను విమానాల్లో క్యారీ చేసేందుకు ఇండియన్ సివిల్ యావేయేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నా ఫోన్‌ను ఏం చేయమంటారు..?, సామ్‌సంగ్‌కు అమితాబ్ సూటి ప్రశ్న!

Read More : లెనోవో Z2 Plus పై అమెజాన్ స్పెషల్ ఆఫర్స్..త్వరపడండి

ఈ నేపథ్యంలో అమితాబ్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఓవర్ హీటింగ్ సమస్యలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ ఇంకా విడుదల కాలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్‌ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది..?


సామ్‌సంగ్‌ను బయుంగ్ - చుల్ లీ అనే వ్యక్తి 1938లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ సంస్థ కొరియా నుంచి చైనాకు ఎండుచేపలు, కూరగాయలు ఇంకా పిండి పదార్థాలను ఓడల సాయంతో ఎగుమతి చేసేది.

మరో అడుగు

తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగువేసిన సామ్‌సంగ్ చెయిల్ పరిశ్రమలను ప్రారంభించి దేశీయంగా వివిధ ఉత్పత్తులను ప్రజలకు అందించింది. 1963లో జుల్‌డాంగ్ బ్యాంగ్‌లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసిన సామ్‌సంగ్ 1989లో ఆ కంపెనీ పేరును సామ్‌సంగ్ లైఫ్‌ఇన్స్యూరెన్స్‌గా మార్చింది. 1965లో పేపర్ పరిశ్రమలోకి సామ్‌సంగ్ అడుగుపెట్టంది.

సామసంగ్ ఎలక్ట్రానిక్స్..

1968, డిసెంబర్ 30.. చైర్మన్ బయుంగ్ - చుల్ లీ నేతృత్వంలోని సామ్‌సంగ్ బృందం సామసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1969, జనవరి 13వ తేదిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించారు. 1970, నవంబర్ నెలలో 12అంగుళాల బ్లాక్‌ అండ్ వైట్ టీవీని సామ్‌సంగ్ ఉత్పత్తి చేయగలిగింది. రెండు నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది.

సామ్‌సంగ్ పెట్రో కెమికల్స్...

వ్యాపారాభివృద్థిలో భాగంగా సామ్‌సంగ్ అదే సంవత్సరం (1970) పెట్రో కెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా మైక్రోవేవో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను పరిచయం చేసింది.

1980లో సెమీ కండెక్టర్‌ల తయారీ..

1980లో సెమీ కండెక్టర్‌ల తయారీ పై దృష్టిసారించిన సామ్‌సంగ్ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీలతో పాటు పర్సనల్ కంప్యూటర్‌లు, వీ.సీ.ఆర్‌లు, టేప్ రికార్డర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.

హార్డ్‌డిస్క్‌లను తయారు చేయడం ప్రారంభించింది

వ్యాపారన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో సామ్‌సంగ్ 1990 మధ్య మెమెురీ కార్డులతో పాటు హార్డ్‌డిస్క్‌లను తయారు చేయడం ప్రారంభింది.

1995లో మొదటి సెల్‌ఫోన్ తయారీ..

1995లో సామ్‌సంగ్ తయారీ చేసిన తొలి మొబైల్ ఫోన్ అనుకున్న స్థాయలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుస్-హీ లీ పనికిరాని వేలాది ఫోన్‌లను ధ్వంసం చేయించారు.

అందుబాటులోకి స్మార్ట్‌ఫోన్స్

మొబైల్ ఫోన్‌ల తయారీని సీరియస్‌గా తీసుకన్న సామ్‌సంగ్ 1999లో ఇంటర్నెట్‌కు అనువైన ఫోన్‌లను తయారు చేయటం మొదలుపెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Note 7's Battery Gives Amitabh Bachchan a Headache. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot