మతిపోగొడుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ స్టూడియో..
దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్, తన మొట్టమొదటి గెలాక్సీ స్టూడియో పాపప్ స్టోర్‌ను మలేషియాలో లాంచ్ చేసింది. కౌలాలంపూర్‌లోని జలాన్ బుకిట్ బిన్టాంగ్ రోడ్‌లో ఓపెన్ చేయబడిన ఈ స్టోర్ ద్వారా సామ్‌సంగ్ లేటెస్డ్ ప్రొడక్ట్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే వీలుంటుంది.

ఈ స్టోర్‌లో ఇటీవల లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 8 (ఎస్ పెన్ సపోర్ట్)తో పాటు గేర్ ఫిట్2 ప్రో, గేర్ వీఆర్ వంటి అనేేక ప్రొడక్ట్స్‌ను సామ్‌సంగ్ అందుబాటులో ఉంచింది. సందర్శకులు వీటిని హ్యాండిల్ చేస్తూ కొత్త ఫీచర్ల పట్ల మరింత అవగాహనను పెంచుకునే వీలుంటుంది.
ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్మార్ట్ టేబుల్ పై గెలాక్సీ నోట్ 8ను ఉంచటం ద్వారా డివైస్‌కు సంబంధించిన మెయిన్ ఫీచర్స్ టేబుల్ పై డిస్‌ప్లే కాబడతాయి. కొత్త ప్రొడక్ట్స్ సందర్శనతో పాటు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్‌ను కూడా ఈ స్టోర్ ద్వారా విజిటర్స్‌కు సామ్‌సంగ్ ఆఫర్ చేస్తోంది.

ఈ యాక్టివిటీస్‌లో పాల్గొనటం ద్వారా తమ ప్రొడక్ట్స్ వినియోగం పట్ల మెరుగైన రీతిలో అవగాహనను ఏర్పరుచుకునే వీలుంటుందని సామ్‌సంగ్ అభిప్రాయపడుతోంది.
ఈ స్టోర్‌కు మరో ప్రత్యేకత వర్చువల్ రియాల్టీ కోస్టర్, 4D Sway chair పై ఏర్పాటు చేయబడిన ఈ
కోస్టర్‌కు గేర్ వీర్ విత్ కంట్రోలర్ సదుపాయం ఉంటుంది. దీని పై వర్చువల్ సైకిలింగ్ సెషన్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.
వీటితో పాటు గేర్ 360, DEX స్టేషన్, గేర్ ఎస్3 క్లాసిక్, గేర్ ఎస్3 ఫ్రాంటియర్ వంటి ప్రొడక్ట్స్‌ను కూడా సామ్‌సంగ్ ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. వినియోగదారులు వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ స్టూడియోలో గెలాక్సీ నోట్ 8ను కొనుగోలు చేయటం ద్వారా గేర్ వీఆర్‌ను సామ్‌సంగ్ ఉచితంగా అందిస్తోంది. ఈ స్టోర్ జనవరి 31, 2018 వరకు తెరిచి ఉంటుందని సామ్‌సంగ్ తెలిపింది.


Click it and Unblock the Notifications