శాంసంగ్ యూజర్లకు గుడ్ న్యూస్, భారీ డిస్కౌంట్లు..

Written By:

శాంసంగ్ తన వినియోగదారులకు సూపర్ గుడ్ న్యూస్ అందించింది. వారం రోజుల పాటు అప్ కమింగ్ ఆన్‌లైన్‌ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్‌ట్లను , క్యాష్‌ బ్యాక్‌ తదితర ఆఫర్లను అందిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. ఇందుకోసం వివిధ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపింది.

షియోమి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ Mi Mix 2పై రూ.5 వేలు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రిస్మస్‌ కార్నివాల్‌..

శాంసంగ్‌ అధికారిక వెబ్‌ సైట్లో క్రిస్మస్‌ కార్నివాల్‌ను ప్రకటించింది. డిసెంబరు 8నుంచి 15 వరకు ‘శాంసంగ్‌షాప్‌' పేరుతో ఆన్‌లైన్‌ సేల్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

నో కాస్ట్‌ ఐఎంఐ ఆఫర్లు

ఈ సేల్‌లో బజాజ్‌,కేషీ ఫై, మొబీ క్విక్‌ లాంటి ఇతర సంస్థల ద్వారా 1.75 శాతం క్యాష్‌బ్యాక్‌, ఎక్సేంజ్‌ ఆఫర్‌, డిస్కౌంట్లు, నో కాస్ట్‌ ఐఎంఐ ఆఫర్లు అందిస్తోంది.

రూ.10వేలకు పైన..

రూ.10వేలకు పైన అన్ని ఉత్పత్తుల కొనుగోళ్లపై బజాజ్‌ ఫిన్‌ నో కాస్ట్‌ ఇఎంఐ అందిస్తోంది. పేటీఎం ద్వారా గెలాక్సీ ఎస్‌8 , ఎస్‌8 ప్లస్‌ , గెలాక్సీ నోట్‌ 8 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తే రూ. 8వేల క్యాష్ బ్యాక్ అందిస్తుంది.

ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్

అదేవిధంగా మొబీక్విక్‌ వాలెట్‌ ద్వారా ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్. కేషీ ఫై శాంసంగ్‌ డివైస్‌లపై 40శాతం బై బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది.

తగ్గింపు ధరలతో..

వీటితో పాటు ఇతర శాంసంగ్‌ మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ఆడియో యాక్సెసరీస్, టెలివిజన్లు లాంటి ఇతర పరికరాలు తగ్గింపు ధరలతో ఈ శాంసంగ్‌ షాప్‌ సేల్‌ లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ఒక వారం పాటు విక్రయాలను..

శాంసంగ్‌ షాప్‌ ద్వారా ఒక వారం పాటు విక్రయాలను ఈ పండుగ సీజన్లో ఆనందించడానికి సంతోషిస్తున్నామని శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ ఉపాధ్యక్షుడు సందీప్ సింగ్ అరోరా చెప్పారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung to offer cashbacks, no-cost EMI during online sale Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot