Home
News

Samsung బంప‌రాఫ‌ర్‌.. Flipkart సేల్‌లో త‌మ మొబైల్స్‌పై 57శాతం డిస్కౌంట్లు!

భార‌త దేశంలో పండ‌గ సీజ‌న్‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌.. ప్ర‌త్యేక సేల్ బిగ్ బిలియ‌న్ డేస్ 2022 ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ Flipkart Big Billion Days Sale 2022 సెప్టెంబ‌ర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ రాబోయే సేల్ లో భాగంగా, Samsung దాని ప్రీమియం మరియు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫ‌ర్ల‌ను అందించ‌నుంది. దాదాపు 57 శాతం వరకు తగ్గింపులను అందిస్తోంది.

Samsung

Galaxy S21 FE 5G, Galaxy S22+, Galaxy F13 మరియు Galaxy F23 5G వంటి హ్యాండ్‌సెట్‌లపై 57 శాతం వరకు త‌గ్గింపుతో అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. మ‌రో ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ కూడా అదే రోజున ప్రారంభమవుతుంది.

Samsung

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో ఈ Samsung స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫ‌ర్లు:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా Samsung మొబైల్స్‌పై ఆఫర్‌లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. అయితే, ఆఫ‌ర్‌లో ఉన్న మొబైల్స్‌లో ఏ వేరియంట్లపై డిస్కౌంట్లు లభిస్తాయనే విషయాన్ని Samsung స్పష్టంగా పేర్కొనలేదు. Galaxy S22+ మరియు Galaxy F23 మొబైల్స్‌పై ఆఫర్‌లు సేల్‌కి ముందే లైవ్‌లో ఉన్నాయి. Galaxy S21 FE 5Gపై ఆఫర్‌లు సెప్టెంబర్ 19న లైవ్‌లోకి వ‌స్తాయి.. మరియు Galaxy F13 ఆఫర్‌లు సెప్టెంబర్ 22న Flipkart Plus వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

Samsung Galaxy S21 FE 5G పై 57 శాతం డిస్కౌంట్‌:
Samsung Galaxy S21 FE 5G మొబైల్‌, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్ర‌స్తుతం భారతదేశంలో ఫ్లిప్ కార్ట్‌లో ధర రూ. 49,999 (MRP: రూ. 74,999) గా ఉంది. అయితే, సేల్ స‌మ‌యంలో కొనుగోలు దారులు దీన్ని 57 శాతం తగ్గింపుతో రూ.31,999 (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) ప్రభావవంతమైన ధరతో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, దాదాపు రూ.24,000 వ‌ర‌కు ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్ కూడా ఉన్న‌ట్లు పేర్కొంది.

Samsung

ఈ మొబైల్స్‌పై కూడా భారీ డిస్కౌంట్లు:
Samsung Galaxy S22+ మొబైల్ 8GB RAM + 128GB వేరియంట్ ధ‌ర ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999 మరియు 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.88,999 గా ఉంది. అయితే, సేల్ స‌మ‌యంలో త‌గ్గింపు త‌ర్వాత ఈ మొబైల్‌ను కేవ‌లం రూ.59,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు వేరియంట్ల‌ MRP ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.1,01,999 మరియు రూ.1,05,999 గా ఉన్నాయి.

మ‌రోవైపు, Samsung Galaxy ఎఫ్23 5జీ, ప్రస్తుతం రూ.13,499 (MRP: 23,999)కు జాబితా చేయ‌బ‌డింది, కానీ సేల్ స‌మ‌యంలో త‌గ్గింపు త‌ర్వాత‌ దీన్ని కేవ‌లం రూ.10,999కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదేవిధంగా, Galaxy F13 ఫోన్ యొక్క 64GB స్టోరేజ్ మోడల్ ధర Flipkartలో 11,999 గా ఉంది, కానీ సేల్ స‌మ‌యంలో త‌గ్గింపు తర్వాత‌ దీన్ని కేవ‌లం రూ.8,499 కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Samsung Galaxy S21 FE 5G స్పెసిఫికేషన్స్:
Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్ One UI 4 మరియు ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung offers huge discounts on their flagship mobiles in flipkart big billion days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X