ఇండియాలో ప్రపంచపు అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీ, శాంసంగ్ కసరత్తు !

By Anil
|

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ ప్రపంచం లోనే అతి పెద్ద ఫోన్ తయారీ ఫ్యాక్టరీని భారతదేశంలో ప్రారంభించింది .ఈ ఫ్యాక్టరీ రిబ్బన్ కటింగ్ వేడుకకు భారత ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ, కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు మూన్ జే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, వైస్ ఛైర్మన్ జే Y. లీ, వైస్ ఛైర్మన్ BK యూన్ మరియు CEO మరియు ఐటి & మొబైల్ కమ్యూనికేషన్స్ DJ కోహ్ అధ్యక్షుడు ఇందులో పాల్గొన్నారు.

 

ఉత్తరప్రదేశ్ నోయిడా లో :

ఉత్తరప్రదేశ్ నోయిడా లో :

స్మార్ట్ ఫోన్ తయారీ ఫ్యాక్టరీ ని ఉత్తర్ ప్రదేశ్ నోయిడా లో ప్రారంభించారు. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు సంవత్సరాలలో 67 మిలియన్ ఫోన్ల నుండి 120 మిలియన్లకు ఫోన్లకు రెట్టింపు చేసింది శాంసంగ్ . ఈ ఫ్యాక్టరీ ద్వారా కనీసం 1,000 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని కంపెనీ భావిస్తుంది.

రూ .4,915 కోట్ల పెట్టుబడి:

రూ .4,915 కోట్ల పెట్టుబడి:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ భారత దేశం లో మొట్టమొదటి సరిగా 1990లో ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ ను ప్రారంభించింది . అయితే 1997 లో టీవీలను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ప్రారంభించింది. 2005 లో మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ జోడించబడింది.గత సంవత్సరం జూన్ లో నోయిడా ప్లాంట్ ను విస్తరించేందుకు రూ .4,915 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది.

5 R & D కేంద్రాలు:
 

5 R & D కేంద్రాలు:

నోయిడాలో, శ్రీపెరంబుదూర్లో, తమిళనాడులో కలిపి మొత్తంగా 5 R & D కేంద్రాలు ఉన్నాయి. నోయిడాలోని ఒక నమూనా కేంద్రంగా శామ్సంగ్ రెండు ఉత్పాదక ప్లాంట్లను కలిగి ఉంది. 70,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు. దాని నెట్వర్క్ లను 1.5 లక్షల రిటైల్ అవుట్లెట్లకు విస్తరించింది.

ఇలాంటి ఫ్యాక్టరీల వళ్ళ  భారత దేశానికి ఎంతో ఉపయోగం:

ఇలాంటి ఫ్యాక్టరీల వళ్ళ భారత దేశానికి ఎంతో ఉపయోగం:

ఇలాంటి ఫ్యాక్టరీల వళ్ళ భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు ఎంతో సహాయం చేస్తుంది. అయితే గత సంవత్సరం 14 శాతం అంటే 124 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది . భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల కోసం డిమాండ్ పెరుగుతూనే ఉంది, ప్రపంచంలోని అతి తక్కువ డేటా ప్రణాళికలను అందించే బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ జీయో క్యారియర్ లో ఇది కొంత భాగం సహాయపడుతుంది.

షియోమీ కీ పోటీగా :

షియోమీ కీ పోటీగా :

చైనీస్ బ్రాండ్ షియోమీతో పోటీపడేందుకు ఉపయోగపడుతుంది అని కంపెనీ భావిస్తుంది .షియోమీ ఈ సంవత్సరం ఎగుమతుల ద్వారా భారతదేశం యొక్క అతిపెద్ద స్మార్ట్ఫోన్ బ్రాండ్ గా మారింది . స్మార్ట్ ఫోన్ల కోసం షియోమీ మార్కెట్ వాటాను 30 శాతానికి దారితీసిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ తెలిపింది, తర్వాత శాంసంగ్ 25 శాతంగా ఉంది.

Best Mobiles in India

English summary
Samsung opens world’s largest mobile phone factory in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X