ఇండియాలో రీసైకిల్ మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్న శామ్‌సంగ్!! వివరాలు ఇవిగో

|

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung ఈ సంవత్సరం మొదటి భాగంలో ఇండియాలో సర్టిఫైడ్ రీసైకిల్ మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నది. ఇప్పటికే ఈ సంస్థ USలో సెల్ఫ్-రిపేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది సాంసంగ్ యజమానులకు డివైస్ యొక్క రిపేరు భాగాలు, మరమ్మతు టూల్స్ లను అందించడంతో పాటుగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌ల రిపేర్ కోసం గైడ్‌లను కూడా అందిస్తుంది. ఇటీవలి నివేదికలో కంపెనీ రీసైకిల్ చేసిన భాగాలను కొత్త సర్వీస్ విభాగంలో వినియోగదారులకు అందించవచ్చని సూచించింది. దీని కారణంగా మరమ్మతు ఖర్చు మరింత తగ్గుతుంది. ఈ ఎకో-ఫ్రెండ్లీ విధానంతో ఇటీవల తీవ్రంగా దెబ్బతిన్న స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌ల వినియోగదారుల యొక్క విశ్వాసాన్ని తిరిగి పొందాలని సంస్థ ఆశిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శామ్‌సంగ్ రీసైకిల్

బిజినెస్ కొరియా యొక్క నివేదిక ప్రకారం శామ్‌సంగ్ రీసైకిల్ భాగాలను వినియోగదారులకు తక్కువ ధరలోనే అందించే యోచనలో ఉంది. అదే సమయంలో రీసైకిల్ భాగాలలో అందించిన నాణ్యత మరియు పనితీరు కొత్త భాగాలకు సమానంగా ఉండేలా చూస్తుంది. గ్రీన్-లైట్ పేరుతో వచ్చే ఈ ప్రోగ్రామ్ కింద మీరు దెబ్బతిన్న డిస్‌ప్లేను రిపేర్ చేయడానికి అయ్యే సాధారణ ఖర్చును మీరు సగానికి తగ్గించుకోవచ్చు.

సెల్ఫ్-రీపేర్ ప్రోగ్రామ్‌

శామ్‌సంగ్ సంస్థ ఇటీవల USలో సెల్ఫ్-రీపేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది రీసైక్లింగ్ కోసం ఉపయోగించిన భాగాలను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. రీసైకిల్ ప్రోగ్రామ్ కోసం కంపెనీ ఈ భాగాలను ఉపయోగించుకోవచ్చని కొన్ని పుకారులు సూచిస్తున్నాయి. ఈ చర్యతో పాత స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించగలదని భావిస్తున్నారు.

గేమింగ్ పనితీరు
 

గేమ్ ఆప్టిమైజింగ్ సర్వీస్ (GOS) స్కాండల్ నుండి పొందిన దుష్ప్రచారానికి శామ్‌సంగ్ భారాన్ని మోపుతోంది. మెరుగైన గేమింగ్ పనితీరు కోసం కంపెనీ గెలాక్సీ పరికరాల కోసం GOS ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రారంభంలో ఈ ఫీచర్‌ని మాన్యువల్‌గా ఆఫ్ చేయడం సాధ్యం కాదు. కావున ఇది చాలా మంది వినియోగదారుల గేమ్ నాణ్యతను తగ్గించింది. ఈ వివాదం ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ S22 సిరీస్ విక్రయాలపై ప్రభావం చూపిందని తాజా నివేదిక సూచించింది. ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ల ధరలు వాటి లాంచ్ ధరలో సగానికి తగ్గించబడినట్లు నివేదించబడింది.

Best Mobiles in India

English summary
Samsung Planning to Launch Recycling Manufacturing Program in India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X